ETV Bharat / sitara

సైఫ్ పుట్టినరోజు కానుకగా కరీనా స్పెషల్ సర్​ప్రైజ్​ - సైఫ్ అలీఖ్​న్​కు కరీనా కపూర్ గిఫ్ట్​

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కరీనా కపూర్​.. భర్త, హీరో సైఫ్​ అలీ ఖాన్​ పుట్టినరోజు సందర్భంగా ఓ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. సైఫ్​ జీవితంలోని ప్రత్యేక సందర్భాలన్నింటినీ ఒకచోటికి చేర్చి ఈ వీడియోను రూపొందించింది.

Kareena Kapoor posts video capturing 50 years of hubby Saif Ali Kha
కరీనా
author img

By

Published : Aug 17, 2020, 6:36 PM IST

Updated : Aug 17, 2020, 7:49 PM IST

బాలీవుడ్​ హీరో సైఫ్​ అలీఖాన్​ ఆగస్టు 16న 55వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా అతడి భార్య, స్టార్​ హీరోయిన్​ కరీనా కపూర్.. సైఫ్​కు సర్​ప్రైజ్​ ఇచ్చింది. పుట్టినరోజు కానుకగా 22 నిమిషాల నిడివి గల వీడియోతో ఆశ్చర్యపరిచింది. సైఫ్ జీవితంలో చిన్నప్పటి నుంచి జరిగిన ప్రత్యేక సందర్భాలన్నింటినీ అందంగా ఒక్కచోటికి చేర్చి ఈ వీడియోను రూపొందించింది. ​సైఫ్ తల్లిదండ్రులు మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, షర్మిలా ఠాగూర్, అతడి పిల్లలు మొదటి భార్య అమృత సింగ్ ఇందులో ఉన్నారు.

ఈ వీడియో నిడివి ఎక్కువుగా ఉండటం వల్ల కేవలం మూడు నిమిషాల వీడియోను ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

ఈ బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌‌కు తైమూర్ అనే కుమారుడు ఉండగా, త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వనుంది కరీనా. ప్రస్తుతం ఆమిర్​ఖాన్​ 'లాల్​సింగ్​ చద్దా'లో నటిస్తోందీ నటి.

ఇది చూడండి అతడితో కాజల్ నిశ్చితార్థం.. నిజమేనా!

Last Updated : Aug 17, 2020, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.