సుమారు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన 'కుచ్ కుచ్ హోతా హై' చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. దీనికి సీక్వెల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు దర్శక నిర్మాత కరణ్ జోహర్.
ఈ మధ్య మెల్బోర్న్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రీమియర్ షో నిర్వహించారు. అక్కడ మీడియా సమావేశంలో కరణ్ జోహార్ తన మనసులోని మాటలు వెల్లడించాడు.
"కుచ్ కుచ్ హోతా హై సినిమాను రీమేక్ చేస్తే ప్రధాన పాత్రల్లో రణ్వీర్ సింగ్, ఆలియా భట్, జాన్వీ కపూర్‌ను తీసుకుంటాను. రాహుల్‌గా రణ్వీర్, అంజలిగా ఆలియా, టీనాగా జాన్వీ చేస్తే బాగుంటుంది. ఇప్పటికే నేను ఆ పాత్రల్లో ఈ ముగ్గురిని ఊహించుకున్నాను" -కరణ్ జోహార్, దర్శక నిర్మాత
1998 అక్టోబర్ 16న తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో షారుక్ ఖాన్, రాణీ ముఖర్జీ, సల్మాన్ ఖాన్, సనా సాయిద్ నటించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై కరణ్ జోహర్ దర్శకత్వం వహించాడు.
ఇవీ చూడండి.. జాన్వీ కపూర్ ఫీట్‌కు అందరూ ఫిదా