ETV Bharat / sitara

కరణ్​జోహార్ కవల పిల్లల్ని చంపేస్తామని బెదిరింపులు! - కరణ్ జోహార్ అనన్య పాండే

కథానాయకుడు సుశాంత్ మృతి విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు దర్శకనిర్మాత కరణ్​ జోహార్. ఈ క్రమంలోనే అతడి కవల పిల్లలను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయని కరణ్ స్నేహితుడు చెప్పారు.

కరణ్​జోహార్ కవల పిల్లల్ని చంపేస్తామని బెదిరింపులు!
కరణ్​ జోహార్
author img

By

Published : Jul 8, 2020, 3:00 PM IST

యువహీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు, బాలీవుడ్​లోని నెపోటిజమ్​ ఓ కారణమని భావించిన నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖుల్ని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. దర్శకనిర్మాత కరణ్​ జోహార్ కూడా ఈ ట్రోలింగ్​ బారినపడ్డాడు. ఈ నేపథ్యంలో స్పందించిన కరణ్​ స్నేహితుడు.. వీటివల్ల అతడు చాలా మనోవేదనకు గురైనట్లు వెల్లడించారు.​ దీంతోపాటే కరణ్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు.

"బయటవాళ్లతో పాటు తెలిసిన వారు కూడా కరణ్​ను విమర్శిస్తున్నారు. దీంతో తానే అపరాధం చేశానని బాధపడుతున్నాడు. అతడి మూడేళ్ల వయసున్న కవల పిల్లల్ని చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ ఘటనతో అసలు సంబంధమే లేని హీరోయిన్ అనన్య పాండేను సుసైడ్ చేసుకోమని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు" -కరణ్​ స్నేహితుడు

అయితే ఈ విషయంలో కరణ్​ మాట్లాడేందుకు సిద్ధంగా లేడని, న్యాయపరంగా వెళ్లాలనుకుంటున్నారని ఆ స్నేహితుడు చెప్పారు.

ప్రస్తుతం కరణ్​ జోహార్.. తన ట్విట్టర్​లో బాలీవుడ్​కు చెందిన ప్రముఖులు, నిర్మాణ సంస్థల ఖాతాలను అన్​ ఫాలో(అనుసరించడం మానేశారు) చేశారు. కేవలం అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అపూర్వ మెహతాను మాత్రమే ఫాలో అవుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.