ఇటీవల కాలంలో తెలుగు సినీప్రియుల్ని ఆకట్టుకున్న వైవిధ్యభరిత చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. వెలుగులోకి రాని అనేక మంది సచిన్‌ల జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకోని ఈ సినిమాను రూపొందించారు. అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
![jersey movie still](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3666509_jersey_still.jpg)
అర్జున్ అనే క్రికెటర్‌గా నాని కనబర్చిన నటన ప్రతిఒక్కరి హృదయాలను హత్తుకుంది. ఇప్పుడీ హిట్ చిత్రంపై బాలీవుడ్ కన్నుపడింది. త్వరలోనే ఈ సినిమాను హిందీలో పునర్నిర్మించేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఈ చిత్ర హక్కులను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కొనుగోలు చేశారని సమాచారం.
మాతృకను తీసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే 'కబీర్ సింగ్'తో ఆకట్టుకున్న షాహిద్ కపూర్.. క్రికెటర్ అర్జున్‌గా కనిపించనున్నాడు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. 'కబీర్ సింగ్'... తెలుగు బ్లాక్బాస్టర్ 'అర్జున్ రెడ్డి' రీమేక్ కావడం విశేషం.
ఇది చదవండి: నాని మాటలు వింటే భయమేసిందన్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి
- " class="align-text-top noRightClick twitterSection" data="">