ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్(Karan Johar), బ్రిటిష్ దర్శకుడు ఆసిఫ్ కపాడియాలకు(Asif Kapadia) లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(BFI London Film Festival) 'ఐకాన్' పురస్కారం దక్కింది. గతవారం ఆన్లైన్లో లండన్ వేదికగా జరిగిన లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో ఈ అవార్డులను ప్రకటించారు. ఇదే వేడుకలో శ్రుతి హాసన్(Shruti Haasan), జాన్వీ కపూర్లకు(Janhvi Kapoor) అవుట్‌స్టాండింగ్ ఎచీవ్మెంట్ అవార్డు దక్కింది. బాగ్రీ ఫౌండేషన్, బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
ఐదేళ్ల తర్వాత
కరణ్ జోహార్(Karan Johar).. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు. 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' అనే ప్రేమకథకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రణ్వీర్ సింగ్(Ranveer Singh), అలియా భట్(Alia Bhatt) హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటీనటులు ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కీలకపాత్రలు పోషించనున్నారు.
ఇదీ చూడండి.. దాదా ఇంటికి వెళ్లిన ఆమిర్‌కు చేదు అనుభవం!