బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు కపిల్ శర్మ.. తండ్రి అయిన తర్వాత, తొలిసారిగా కూతురు ఫొటోను ఇన్స్టాలో పంచుకున్నాడు. దానితో పాటు, ఆత్మీయంగా చూస్తున్న మరో ఫొటోను షేర్ చేశాడు. " మా హృదయం అనైరా శర్మ" అంటూ రాసుకొచ్చాడు.
కొద్ది గంటల్లోనే ఆ బుజ్జాయి ఫొటో వైరల్గా మారింది. లక్షల్లో లైకులతో దూసుకుపోతోంది. 2018లో తన స్నేహితురాలు గిన్నీ చరాత్ను వివాహం చేసుకున్నాడు కపిల్. గత నెలలో వీరికి పాప జన్మించింది.
'కామెడీ నైట్స్ విత్ కపిల్' షోతో ప్రఖ్యాతి చెందాడు కపిల్ శర్మ. ఓ షోకు అత్యంత ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న వ్యక్తిగానూ రికార్డు సృష్టించాడు. ఇదే కాకుండా బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించడమే కాకుండా, 'సన్నాఫ్ మంజీత్ సింగ్' నిర్మాతగానూ మారాడు.
ఇవీ చదవండి: