మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, 'పెళ్లి చూపులు' ఫేమ్ రీతువర్మ జంటగా నటించిన సినిమా 'కనులు కనులను దోచాయంటే'. దర్శకుడు గౌతమ్ మేనన్ కీలక పాత్ర పోషించాడు. ఈరోజు విడుదలైన ట్రైలర్.. సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.
హీరో, అతడి స్నేహితుడు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు. ఆ తర్వాత వారు చేసిన పనులు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టాయి? ఎలా బయటపడ్డారు? అనేదే ఈ చిత్ర కథాంశం.
ఇందులోని 'ఇండియాలో ఆన్‌లైన్ ట్రేడ్‌కు వన్ ఇయర్ వర్త్ ఎంతో తెలుసా? రెండు లక్షల కోట్లు. సుమారు 10 కోట్లమంది ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. మనం వెతికేవాడు ఆ పది కోట్లలో ఒక్కడు', 'మేం చేసిన బుర్ర తక్కువ పని లవ్ చేయడం', 'ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా.. గోవిందా' అనే డైలాగ్‌లు అలరిస్తున్నాయి.
ప్రస్తుతం నిర్మాణనంతర పనులు జరుపుకుంటోందీ సినిమా. ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహించగా, వయకామ్ 18 స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">