ETV Bharat / sitara

హీరో యశ్​ దగ్గర ఉన్న లగ్జరీ కార్లు ఇవే! - హీరో యశ్​ కార్లు

కన్నడ స్టార్​ హీరో యశ్​కు కార్లంటే అమితమైన ఇష్టమట. ఆయన వద్ద విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

yash
యశ్​
author img

By

Published : Feb 27, 2021, 12:31 PM IST

Updated : Feb 27, 2021, 12:39 PM IST

కన్నడ కథానాయకుడు యశ్‌ 'కేజీయఫ్‌' చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా 'కేజీయఫ్‌'కు సీక్వెల్‌గా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న 'కె.జి.యఫ్‌: చాప్టర్‌2'లో నటిస్తున్నారు. యశ్‌కు కార్లంటే చాలా ప్రేమ. అందుకే ఆయన దగ్గర ఆడి క్యూ 7(రూ.73.73-రూ.85.18 లక్షలు), మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డి జీఎల్ఎస్ లైనప్‌లో టాప్ మోడల్‌ కార్(ప్రారంభ ధర రూ.1.5కోట్లు)‌తో పాటు బీఎమ్‌డబ్ల్యు 520డీ(రు.60.89లక్షలు) లాంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.

yash
ఆడీ క్యూ 7
yash
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డి
yash
బీఎమ్‌డబ్ల్యు 520డీ

యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ మధ్య 'కేజీయఫ్‌2' సినిమా టీజర్‌ విడుదలై సంచలనం సృష్టించింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. ప్రతినాయకుడు అధీరా పాత్రలో సంజయ్‌ దత్‌ నటిస్తుండగా..రవీనా టాండన్, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి ప్రముఖ నటులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రాన్ని దక్షిణాదితో పాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ సినిమా జులై 16, 2021న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: మాల్దీవుల విహారయాత్రలో రాకీభాయ్​

Last Updated : Feb 27, 2021, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.