కన్నడ సినీ పరిశ్రమలోని కొందరితో డ్రగ్స్ ముఠాకు ఉన్న సంబంధంపై ఆరా తీసేందుకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) రంగంలోకి దిగింది. విచారణలో భాగంగా నటి రాగిణికి నోటీసులు జారీ చేసింది. బెంగళూరులోని సీసీబీ ప్రధాన కార్యాలయం ఎదుట గురువారం హాజరవ్వాలని తెలిపారు. అడిషనల్ కమీషనర్ సందీప్ పాటిల్ బృందం ఆమెను ప్రశ్నించనుంది.
-
Karnataka: Kannada filmmaker Indrajit Lankesh arrives at Central Crime Branch (CCB) in Bengaluru, over his remarks on alleged drug use in Kannada film industry. pic.twitter.com/RKSJxxnVr6
— ANI (@ANI) September 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Karnataka: Kannada filmmaker Indrajit Lankesh arrives at Central Crime Branch (CCB) in Bengaluru, over his remarks on alleged drug use in Kannada film industry. pic.twitter.com/RKSJxxnVr6
— ANI (@ANI) September 3, 2020Karnataka: Kannada filmmaker Indrajit Lankesh arrives at Central Crime Branch (CCB) in Bengaluru, over his remarks on alleged drug use in Kannada film industry. pic.twitter.com/RKSJxxnVr6
— ANI (@ANI) September 3, 2020
కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతుందని, ఎంతోమంది మాదకద్రవ్యాల బారిన పడ్డారని డైరెక్టర్ ఇంద్రజిత్ లంకేశ్ ఇటీవలే ఆరోపణలు చేశారు. దీంతో పాటు బీజేపీ నాయకురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్న సీసీబీ బృందం, ఇంద్రజిత్‌ను బుధవారం ఐదుగంటల పాటు ప్రశ్నించింది. శాండల్‌వుడ్‌కు చెందిన 15 మంది ప్రముఖులకు ఈ డ్రగ్ రాకెట్‌తో లింక్ ఉన్నట్లు ఆయన చెప్పినట్లు సమాచారం. గురువారం మరోసారి హాజరు కావాలని చెప్పగా, బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు దర్శకుడు ఇంద్రజిత్ వచ్చారు.