ETV Bharat / sitara

కంగన గ్యాంగ్​ నుంచి సమంతకు అరుదైన మెసేజ్ - సమంత

'ఓ బేబీ' సినిమాలో సమంత నటనను ప్రశంసిస్తూ కంగనా రనౌత్ సోదరి రంగోలీ ట్వీట్ చేశారు. కంగనా బృందం తరఫున ఆల్ ద బెస్ట్ చెప్పారు.

'ఓ బేబీ'కు కంగనా బృందం ప్రశంసలు
author img

By

Published : Jul 5, 2019, 7:01 PM IST

ఎప్పుడూ తనదైన శైలిలో సూటిగా సమాధానమిస్తూ వార్తల్లో నిలిచే బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. ఆమె సోదరి రంగోలీ అలానే ఉంటుంది. వీళ్లు మరొకర్ని మెచ్చుకోవడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఆ అవకాశం సమంతకు దక్కింది. శుక్రవారం విడుదలైన 'ఓ బేబీ' ప్రేక్షకులను కట్టిపడేసిందంటూ ప్రచురితమైన ఓ కథనాన్ని ట్విటర్‌లో రీట్వీట్‌ చేసింది రంగోలీ.

kangana ranuath rangoli retweet
కంగనా సోదరి రంగోలీ రీట్వీట్

"'ఓ బేబీ' మంచి విజయం సాధించింది. సమంత ఫెమినిస్ట్‌. ఓ గొప్ప కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తన నటనా ప్రతిభతో సొంత గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి వారిని మేం అభిమానిస్తాం. కంగనా బృందం తరఫున మీకు ఆల్‌ ద బెస్ట్‌" -రంగోలీ, కంగనా రనౌత్ సోదరి

స్పందించిన సమంత.. 'మీకు హృదయపూర్వక ధన్యవాదాలు' అని సమాధానం ఇచ్చింది.

samantha in oh babay
ఓ బేబీ సినిమాలో సమంత స్టిల్

ఇది చదవండి: నివేదా.. కుర్రకారు ఫిదా

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.