ETV Bharat / sitara

'తలైవి' సెన్సార్​ పూర్తి.. 'విక్రమార్కుడు' @15 - సూర్య జ్యోతిక వ్యాక్సిన్

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. కంగనా రనౌత్​ 'తలైవి'(Thalaivi) సెన్సార్​తో పాటు ఎల్​.కె.జి. రిలీజ్​, 'ఎస్​.ఆర్​. కల్యాణమండపం'(SR Kalyanamandapam) సాంగ్​ అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి.

Kangana Ranaut's Thalaivi issued 'U' certificate in Tamil
'తలైవి' సెన్సార్​ పూర్తి.. 'విక్రమార్కుడు' @15
author img

By

Published : Jun 22, 2021, 10:15 PM IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'తలైవి'(Thalaivi). ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో కంగనా రనౌత్ (Kangana Ranaut) టైటిల్ పాత్రలో నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన తమిళ వర్షెన్​కు సెన్సార్​ 'యూ' సర్టిఫికేట్​ ఇచ్చింది. త్వరలోనే తెలుగు, హిందీ వర్షెన్లను సెన్సార్​కు పంపిస్తామని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలో ఎంజీఆర్​గా అరవింద్ స్వామి.. కరుణానిధి పాత్రలో ప్రకాశ్​ రాజ్ కనిపించనున్నారు. శశికళగా పూర్ణ నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్​ స్వరాలందిస్తున్నారు. విష్ణు ఇందూరి శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Kangana Ranaut's Thalaivi issued 'U' certificate in Tamil
'తలైవి' సినిమా సెన్సార్​

ఎల్​.కె.జి. ట్రైలర్​

తమిళ నటుడు ఆర్​.జె. బాలాజీ(RJ Balaji) కీలక పాత్రలో నటించిన చిత్రం 'ఎల్‌.కె.జి'(L.K.G). ప్రియా ఆనంద్‌(Priya Anand) కథానాయిక. కె.ఆర్‌. ప్రభు దర్శకత్వం వహించారు. 2019లో తమిళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌ అందుకుంది. రాజకీయ వ్యంగ్య చిత్రంగా మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులో ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా 'ఎల్‌.కె.జి.-2020' పేరుతో జూన్ 25 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. 'నేను పవర్‌స్టార్‌కు అభిమానిని. ఆయన సినిమాలు చూస్తే, ఆ పార్టీలో చేరతానా' అంటూ ఆర్జే బాలాజీ పలుకుతున్న సంభాషణలు అలరిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయాలను వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ సినిమాను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. మరి ఆ నవ్వుల పువ్వులు చూడాలంటే జూన్‌ 25 వరకూ వేచి చూడాల్సిందే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విక్రమార్కుడు @15

మాస్​ మహారాజ్​ రవితేజ (Ravi Teja) హీరో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సూపర్​హిట్​ చిత్రం 'విక్రమార్కుడు' (Vikramarkudu). అనుష్క శెట్టి కథానాయిక. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి నేటితో 15 ఏళ్లు పూర్తయ్యింది.

'విక్రమార్కుడు' సినిమాకు 15 ఏళ్లు

సూర్య దంపతులకు వ్యాక్సిన్​

తమిళ స్టార్​ హీరో సూర్య (Suriya), జ్యోతిక (Jyotika) కరోనా టీకా తీసుకున్నారు. చెన్నెలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో వీరిద్దరూ వ్యాక్సిన్​ తీసుకున్నట్లు సోషల్​మీడియాలో వెల్లడించారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్​గా మారాయి.

వ్యాక్సిన్​ తీసుకున్న సూర్య, జ్యోతిక

సుకుమార్​ చేతుల మీదుగా..

యువ కథానాయకుడు కిరణ్​ అబ్బవరం, ప్రియాంక జవల్కర్​ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఎస్​.ఆర్​. కల్యాణమండపం' (SR Kalyana mandapam). శ్రీధర్​ గాదె దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సాయి కుమార్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలోని 'సిగ్గెందుకురా మామ' సాంగ్​ను ప్రముఖ దర్శకుడు సుకుమార్​ విడుదల చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు సుకుమార్​ ట్వీట్​ చేశారు.

'ఎస్​.ఆర్​. కల్యాణమండపం' లిరికల్​ సాంగ్​ రిలీజ్​

ఇదీ చూడండి.. ప్రముఖ కర్ణాటిక్​ సింగర్​ పొన్నమ్మల్​ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.