ETV Bharat / sitara

ట్విట్టర్​లో కంగనాకు తగ్గిపోతున్న ఫాలోవర్స్!​ - తగ్గిపోతున్నకంగనా ఫాలోవర్స్​

తనను ట్విట్టర్​లో అన్​ఫాలో చేస్తున్న వారికి హృద‌య‌పూర్వ‌క క్ష‌మాప‌ణ‌లు చెప్పింది హీరోయిన్​ కంగనా రనౌత్​. ఫాలోవర్ల సంఖ్య ఎందుకు తగ్గిపోతుందో అర్థం కావట్లేదని తెలిపింది.

Kangana
కంగనా
author img

By

Published : Sep 1, 2020, 7:35 PM IST

నటుడు సుశాంత్ రాజ్​పుత్ ఆత్మహత్య త‌ర్వాత బాలీవుడ్‌లో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నెపొటిజమ్ అంశం తీవ్రంగా చర్చనీయాంశమైంది. సినీవారసుల సోషల్‌ మీడియా ఖాతాలను నెటిజన్లు అన్‌ఫాలో చేస్తున్నారు. కానీ ఇప్పుడు బంధుప్రీతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తోన్న కంగనా రనౌత్​కూ ఈ బాధ తప్పట్లేదు. కంగన ట్విట్టర్​లో ఓ రోజుకి దాదాపు 40-50వేల ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోతుంది. ప్రస్తుతం ఈ విషయమై మాట్లాడింది కంగన. నెటిజన్లు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పింది.

"రోజూ ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోవడం నేను గ‌మ‌నించా. ఈ ప్లాట్​ఫాం నాకు కొత్త‌. ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలియట్లేదు. జాతీయవాదులు ప్రతి చోట కష్టపడాల్సి వస్తుంది. రాకెట్ చాలా బ‌లంగా ఉంది. అన్‌ఫాలో చేసిన వారికి హృద‌య‌పూర్వ‌క క్ష‌మాప‌ణ‌లు."

- కంగ‌నా రనౌత్ ట్వీట్​.

సుశాంత్​ చావుకి చిత్రసీమలోని ప్రముఖులే కారణమంటూ పలువురిపై బహిరంగంగానే విమర్శలు చేస్తోంది కంగన. ప్రస్తుతం నటుడి ఆత్మహత్య కేసును సీబీఐ విచారణ జరుపుతోంది.

  • Hmm I see Nationalists have to struggle every where, racket is so strong, I noticed because last night we were to very close to a million, anyway, sincere apologies to all those who are getting unfollows automatically, so unfair but arnt we used to this now 🙂? https://t.co/ZWei0QhJOB

    — Kangana Ranaut (@KanganaTeam) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇది చూడండి 'ఇప్పట్లో మా ఇద్దరికి పెళ్లి ఆలోచన లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.