బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నటి కంగనా రనౌత్... తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి బయోపిక్ 'తలైవి'లో ప్రస్తుతం నటిస్తోంది. చిత్రీకరణ ప్రస్తుతం తమిళనాడులోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామేశ్వరంలోని జ్యోతిర్లింగ దర్శనం చేసుకుందీ భామ. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించింది. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మారకాన్ని ఆ తర్వాత సందర్శించింది.

'తలైవి'లోని టైటిల్ పాత్రలో కంగనా కనిపించనుంది. ఇందులో కరుణానిధిగా ప్రకాశ్‌రాజ్, ఎమ్జీఆర్గా అరవింద స్వామి నటిస్తున్నారు. ఏఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

ఇదీ చూడండి.. తమిళనాట ఎన్నికల్లో పోటీపడనున్న కంగనా, ప్రకాష్‌రాజ్!