ETV Bharat / sitara

'సల్మాన్​ సినిమాకు నో చెప్పినందుకు బెదిరించారు' - kangana got threats

ఏ విషయంపై అయినా నిర్భయంగా, ముక్కుసూటిగా మాట్లాడే బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. సల్మాన్​ఖాన్​ సినిమా ఆఫర్​ను తిరస్కరించినందుకు​ దర్శకుడి నుంచి బెదిరింపులు వచ్చాయని పేర్కొంది.

kangana ranaut
'సల్మాన్​ సినిమాకు నో చెప్పినందుకు బెదిరించారు'
author img

By

Published : Jul 19, 2020, 9:42 AM IST

సినీ పరిశ్రమ.. అదో రంగుల ప్రపంచం. తెరపై సినిమా అద్భుతంగా ఉన్నా.. తెర వెనుక కొన్ని అంశాలు చేదుగా ఉంటాయి. బంధుప్రీతి, కాస్టింగ్‌ కౌచ్‌, బెదిరింపులు వంటివి వాటిలో కొన్ని. సినీ పరిశ్రమలోని తప్పొప్పుల్ని నిర్భయంగా చెప్పే నటి కంగనా రనౌత్‌.. తనకు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి తాజాగా వెల్లడించింది.

సల్మాన్‌ ఖాన్‌ నటించిన 'సుల్తాన్‌'కు నో చెప్పినందుకు ఆ సినిమా నిర్మాత, యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ హెడ్‌ ఆదిత్య చోప్రా తనను బెదిరించాడని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కంగన బయటపెట్టింది.

"ఆ సినిమా దర్శకుడు మా ఇంటికి వచ్చి నాకు స్క్రిప్ట్‌ చెప్పారు. ఆ తర్వాత ఆదిత్య చోప్రాను కలిసి నేను ఈ సినిమాలో నటించలేనని చెప్పాను. అప్పుడు ఆయన బాగానే ఉన్నారు. ఆ తర్వాత 'కంగనా.. సుల్తాన్‌ సినిమాకి నో చెప్పింది' అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. దీంతో ఆదిత్య చోప్రా 'నీకు ఎంత ధైర్యం? నా సినిమాకు నువ్వు నో చెప్తావా? నువ్వు అయిపోయావ్‌' అని నాకు మెసెజ్‌ చేశారు" అని కంగన చెప్పుకొచ్చింది.

గతంలో ఈ సినిమా గురించే చెబుతూ.. సుల్తాన్‌ చిత్రంలో నటించడానికి నో చెప్పడం వల్ల ఆదిత్య చోప్రా "నాకు ఫోన్‌ చేసి 'నేను నీతో ఎప్పటికీ సినిమా చేయను' అని చెప్పాడు" అని తెలిపింది.

2016లో విడుదలైన 'సుల్తాన్‌' సినిమాలో సల్మాన్‌కు జోడీగా అనుష్క శర్మ నటించింది. అయితే మొదట హీరోయిన్‌ పాత్ర కోసం చిత్ర బృందం దీపికా పదుకొణెను సంప్రదించింది. ఆమెకు డేట్స్‌ కుదరకపోవడం వల్ల ఆ ఆఫర్‌ కంగనా రనౌత్‌ వద్దకు వచ్చింది. కానీ ఆమె నో చెప్పింది. దీంతో అనుష్కశర్మను హీరోయిన్‌గా తీసుకున్నారు.

కంగనా రనౌత్‌ మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తుంటుంది. ఆ సమయంలో 'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌' చిత్రంతో కంగన హిట్‌ కొట్టింది. తదుపరి చిత్రంలో సల్మాన్‌కు జోడిగా మాత్రమే నటించి తన ప్రాధాన్యతను తగ్గించుకోవడం ఇష్టం లేక ఆ సినిమాలో నటించలేదని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.