ETV Bharat / sitara

రూ.2 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని కంగన పిటిషన్​

ముంబయిలోని పాలీహిల్​లో తన నివాసాన్ని కూల్చివేసిన క్రమంలో రూ.2 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని నటి కంగనా రనౌత్​ ఆరోపించింది. దీనికి కారణమైన ముంబయి మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నష్టాన్ని భర్తీ చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది కంగన.

Kangana Ranaut is seeking Rs 2 crore for the damages suffered post BMC's demolition drive
కూల్చివేతలో రూ.2 కోట్ల ఆస్తి నష్టం..కోర్టులో కంగన పిటిషన్​
author img

By

Published : Sep 15, 2020, 3:05 PM IST

Updated : Sep 15, 2020, 3:13 PM IST

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ నివాసాన్ని అక్రమ కట్టడం అంటూ పాక్షికంగా కూల్చివేసింది ముంబయి మహానగర పాలక సంస్థ (బీఎంసీ). ఈ నేపథ్యంలో తన నివాసంలో రూ.2 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగిందని నటి కంగన ముంబయి హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. ఇంటీరియర్​ కళాకృతులు, సోఫా వంటి విలువైన వస్తువులతో కలిపి 40 శాతానికి పైగా ఆస్తి ధ్వంసం అయినట్లు పేర్కొంది. ఆ మొత్తాన్ని బీఎంసీ చెల్లించాలంటూ కోర్టుకు విన్నవించుకుంది. నోటీసులు జారీ చేసిన 24 గంటల్లోనే కూల్చివేతను ఆమె సవాలు చేసింది.

ఏం జరిగింది?

ముంబయిలోని పాలీహిల్​లో కంగన తన నివాసాన్ని నిబంధనలను అతిక్రమించి కట్టిందనే ఆరోపణలతో బీఎంసీ గతంలో నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత రోజే ఆమె నివాసాన్ని కూల్చేందుకు మున్సిపల్​ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయంలో వారికి వివరణ ఇవ్వడానికి గతవారం కంగన ముంబయి చేరుకుంది. అయితే ఈ దాడిని మహారాష్ట్ర సర్కారులో కొలువుదీరిన శివసేన చేయించిందని ఆమె ఆరోపించడం వల్ల ఆ పార్టీ నాయకులకు, కంగనకు మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

Last Updated : Sep 15, 2020, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.