ETV Bharat / sitara

కుటుంబంతో మనాలిలో కంగనా హంగామా - కంగనా రనౌత్ మనాలి ట్రిప్

ప్రముఖ నటి కంగనా రనౌత్.. తన కుటుంబసభ్యుల కోసం పిక్నిక్​ ఏర్పాటు చేసింది. వీరంతా కలిసి మనాలిలో తెగ సందడి చేశారు. ఆ ఫొటోలు, వీడియోలను కంగన టీమ్ సోషల్ మీడియాలో పంచుకుంది.​

కుటుంబంతో మనాలిలో కంగనా హంగామా
కంగనా రనౌత్
author img

By

Published : Jul 4, 2020, 9:02 PM IST

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌.. ఉన్నది ఉన్నట్లు మోహం మీదనే అనేస్తుందనే మాట చిత్రసీమలో వినిపిస్తోంది. 'మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ'లో శత్రువులను తుద్దముట్టింటే వీరనారిగా మెప్పించింది. నిజజీవితానికి వచ్చేసరికి తన కుటుంబ సభ్యులతో కలిసి చిన్నపిల్లలా మారిపోతుంది. లాక్‌డౌన్ కారణంగా చాన్నాళ్లు ఇంట్లోనే ఉన్న కంగన.. తాజాగా తన కుటుంబసభ్యులతో కలిసి మనాలి పిక్నిక్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె తన సోదరి రంగోలి చందేల్‌ కొడుకుతో కలిసి చేసిన అల్లరంతా అంతా ఇంతా కాదు. ఆ సంతోషాన్ని టీమ్ కంగన‌ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

  • Kangana organised a picnic for her family. Even though they are in the green zone, they appreciate all the permissions given by the Himanchal Pardesh authorities 🙏
    Check out the beautiful video of Kangana & her family in Manali Mountains here https://t.co/owfjXA52D7

    — Team Kangana Ranaut (@KanganaTeam) July 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇందులో కంగన చిన్నపిల్లలా మారి ఒక్కతే డ్యాన్స్ చేస్తూ, మరోచోట పార్క్​లో రోలర్‌లా పైనుంచి కిందికి దొర్లుతూ నానా హంగామా చేసింది.

ప్రస్తుతం లోయలో ఎలాంటి పర్యాటకులు లేరు. ఫలితంగా స్వచ్ఛమైన వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉంది. మనం ఎక్కడున్నా ప్రకృతి మనల్ని ఎంతో సంతోషపెడుతుంది. ప్రతి దాంట్లోనూ ఆనందం ఉంటుంది. దాన్ని మనం వెతికి పట్టుకోవాలి అంటూ ట్విట్టర్లో పేర్కొంది కంగన టీమ్.

కంగనా ప్రస్తుతం జయలలిత బయోపిక్ 'తలైవి'లో నటిస్తోంది. ఏఎల్‌ విజయ్ దర్శకుడు. ఇందులో ఎమ్జీఆర్‌గా అరవింద స్వామి కనిపించనున్నారు. దీంతో పాటే వివాదస్పద రామజన్మభూమి ఆధారంగా 'అపరాజిత అయోధ్య' అనే సినిమా చేయన్నుట్లు ప్రకటించిందీ భామ.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.