ట్విటర్‌లో శాశ్వత నిషేధానికి గురైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు మరో సామాజికమాధ్యమ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ షాకిచ్చింది. తనకు కరోనా సోకిందని నటి చేసిన పోస్ట్‌ను ఇన్‌స్టా తొలగించింది. తాను వైరస్ బారిన పడినట్లు గతవారం సోషల్‌మీడియా వేదికగా వెల్లడించిన కంగనా.. కరోనానూ చిన్నపాటి ఫ్లూతో పోల్చింది.
దీంతో ఆమె తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె పోస్ట్‌ను ఇన్‌స్టా డిలీట్ చేసింది.ఈ విషయాన్ని కంగన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ.. విమర్శలు గుప్పించింది.
"కొవిడ్‌ను నాశనం చేద్దామని నేను చేసిన పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్ తొలగించింది. ఎందుకంటే ఈ పోస్ట్ వల్ల కొందరు బాధపడి ఉంటారు. ఉగ్రవాదులు, కమ్యూనిస్టు సానుభూతిపరులు ట్విటర్‌లోనే ఉంటారనుకున్నా."
- కంగనా రనౌత్, కథానాయిక
గతవారం కంగన ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిలిపివేసింది. ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఆమె చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కించపర్చేలా ఉండటం వల్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలోనూ ఆమె పలు విద్వేషపూరిత పోస్టులు చేయడం వల్ల ట్విట్టర్ నియమ, నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ ఆమెపై నిషేధం విధించినట్లు ఆ సోషల్‌మీడియా సంస్థ వెల్లడించింది.
ఇదీ చూడండి: హీరోయిన్ కంగనా రనౌత్‌కు ట్విట్టర్ షాక్