బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ ఐదేళ్ల క్రితం నిషేధించింది. అయితే నిషేధం ఉన్నప్పటికీ తన చిత్రాలను సదరు మ్యాగజైన్లో ఉపయోగిస్తూ, వారు ప్రచారం చేసుకుంటున్నారని కంగనా రనౌత్ బృందం ట్వీట్ చేసింది.
"కంగనా రనౌత్‌పై ఐదేళ్ల క్రితం వోగ్ ఇండియా నిషేధం విధించింది. ఎందుకంటే ఆ సంస్థకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ అనైతా అదజానియా.. ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్‌కు సన్నిహితులు కావడమే ఇందుకు కారణం. కంగనపై నిషేధం విధించినప్పటికీ ఆమె ఫొటోలు, వీడియోలను ఇప్పటికీ ఉపయోగిస్తూ సొమ్ము చేసుకుంటోంది సదరు సంస్థ."
-కంగనా రనౌత్ టీమ్ ట్వీట్
'ఫ్యాషన్' చిత్రం విడుదల సమయంలో తనను ఎంపిక చేశారని, ఆ తర్వాత ప్రియాంకా చోప్రాతో ఫొటోషూట్ చేశారని చెప్పింది కంగన. ప్రముఖ హీరోయిన్ల జాబితాలో లేకపోవడమే కారణమని అప్పుడు సంస్థ ప్రతినిధులు తనతో చెప్పినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
2014లో ఓ కవర్ ఫొటోషూట్ కోసం తనను సంప్రదించారని, కానీ తనకు స్టైలింగ్ చేసేందుకు డిజైనర్ అనైతా నిరాకరించిందని కంగన చెప్పింది. అప్పుడు అనైతా తన సహాయకుడిని పంపిందని తెలిపింది.
'క్వీన్' సినిమా తర్వాత తరచుగా ఆ సంస్థ నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతూ, మ్యాగజైన్ కవర్ కోసం వారితో కలిసి పనిచేశానని కంగనా రనౌత్ చెప్పింది. అయితే ఫొటోషూట్ల కోసం అనైతా డిజైనింగ్స్ అడగ్గా, ఆ సంస్థ సరిగా స్పందించకుండా తనతో విచిత్రంగా ప్రవర్తించారని తెలిపింది. అప్పటివరకు కేవలం వోగ్‌తో రెండు కవర్ ఫొటోల కోసమే పనిచేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాత నిషేధం ఎదుర్కొంటున్నా.. తన ఫొటోలు, వీడియోలను వినియోగించి సొమ్ము చేసుకోవడం ఎంతవరకు న్యాయమని ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.