బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆకాల మరణంపై నిరంతరం తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్న నటి కంగనా రనౌత్.. తాజాగా మరో అంశం లేవనెత్తింది. 'దిల్ బెచారా' హీరోయిన్ సంజనా సంఘీపై సుశాంత్ అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై సదరు నటి స్పందించకపోవడంపై విచారం వ్యక్తం చేసింది. అతడితో తనకున్న రెండేళ్ల స్నేహాన్ని తెలియజేసేందుకు సంజన ఎందుకు ఆలోచిస్తోందని ప్రశ్నించింది.
"సుశాంత్.. సంజనపై అత్యాచారం చేశాడని చాలామంది అంటున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి పుకార్లు రావడం సాధారణం. కానీ, ఈ విషయంపై స్పందించడానికి ఆమె ఎక్కువ సమయాన్ని ఎందుకు తీసుకుంటుంది? సుశాంత్‌తో ఉన్న స్నేహాన్ని ఎందుకు వ్యక్తపరచలేదు?"
-టీమ్ కంగనా రనౌత్ ట్వీట్
సుశాంత్ మృతిపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఇటీవలే సంజనను దాదాపు ఏడు గంటలపాటు ముంబయి పోలీసులు ప్రశ్నించారు.
సుశాంత్ మృతిపై న్యాయం జరిపించాలని డిమాండ్ చేస్తూ, క్యాబినెట్ మాజీ మంత్రి సుబ్రమణియన్ స్వామి తరపు న్యాయవాది ఇష్కరన్ సింగ్ భండారి.. 'క్యాండిల్ ఫర్ ఎస్ఎస్ఆర్' ఆన్లైన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే, కంగనా రనౌత్, శేఖర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.