గతేడాది చిన్న చిత్రంగా విడుదలై ప్రేక్షకుల మన్ననలు అందుకుంది 'కేరాఫ్ కంచరపాలెం'. తాజాగా ఈ మూవీ తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ కాబోతుంది. 'త్రిపుర' చిత్రాన్ని నిర్మించిన యమ్. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.
తమిళ, మలయాళ భాషల్లో పేరొందిన నటీనటులు ఈ సినిమాలో నటించనున్నట్లు రాజశేఖర్రెడ్డి తెలిపారు. మిగతా వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. జూన్ చివరి వారంలో 'కేరాఫ్ కంచరపాలెం' రీమేక్ పట్టాలెక్కనుంది.
ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి తమిళ సినిమాలను తెలుగులోకి అనువదించారు. అలాగే ఇక్కడ విజయవంతమైన చిత్రాలను తమిళంలోకి డబ్ చేశారు. 'నకిలీ', 'ప్రేమలో పడితే' లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">