ETV Bharat / sitara

కమల్​.. విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్ - hero kamal haasan

విలక్షణ నటనకు మారుపేరు.. విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్​గా నిలిచిన నటుడు కమల్ హాసన్. ఈ హీరో పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా కమల్​ గురించి ప్రత్యేక కథనం.​

కమల్
author img

By

Published : Nov 7, 2019, 8:58 AM IST

కమల్‌ హాసన్‌... విలక్షణ నటుడు. తను నటించే సినిమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని, రొటీన్‌ పాత్రలకు అది భిన్నంగా ఉండాలని కోరుకునే వ్యక్తి. అందుకే అతడు సంచలన దర్శకుడు బాలచందర్‌కు సరైన జోడీ అయ్యాడు. కమల్‌ హాసన్‌ కేవలం నటుడే కాదు మంచి కథకుడు, స్కీన్ర్‌ ప్లే రచయిత, నిర్మాత, దర్శకుడు.. చివరికి అజ్ఞాత సంగీత దర్శకుడు కూడా. ఈరోజు (నవంబర్‌ 7) కమల్‌ హాసన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా కమల్‌ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుందాం..

కమల్‌ హాసన్‌ అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్‌. 1954 నవంబర్‌ 7న తమిళనాడులోని రామనాథపురానికి చేరువలో ఉన్న పరమక్కుడి పట్టణంలో జన్మించాడు. తండ్రి డి.శ్రీనివాసన్‌ న్యాయవాద వృత్తిలో ఉండేవారు. కమల్‌ తల్లి రాజలక్ష్మి మంచి డ్యాన్సర్‌. చిన్నప్పటి నుంచి కమల్‌ చదువుకుంటూనే కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషిస్తూ ఉండేవాడు. అలా తన తొలి వెండితెర పరిచయం 1970లో విడుదలైన 'మాణవన్‌' చిత్రం ద్వారా జరిగింది. అందులో కమల్‌ కుట్టి పద్మిని చేసే డ్యాన్స్‌ సన్నివేశంలో ఆమెతో కలిసి కనిపిస్తాడు. 'అణ్నై వేలంకణ్ణి' సినిమాలో కాసేపు ఏసు క్రీస్తుగా కనిపిస్తాడు. 1975లో బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన 'అపూర్వ రాగంగ్' (తెలుగులో తూర్పు-పడమర) సినిమా హీరోగా మంచి బ్రేక్‌ ఇచ్చింది. రజనీకాంత్‌ ఈ సినిమాతోనే తెరంగేట్రం చేశాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆస్పత్రి నుంచే బాల నటుడిగా...

1960లో ఎ.వి.ఎం. అధినేత మెయ్యప్ప చెట్టియార్‌ తమిళంలో 'కళత్తూర్‌ కన్నమ్మ' సినిమా నిర్మించారు. భీమ్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సావిత్రి, జెమిని గణేశన్‌ నాయికా నాయకులు. అందులో ఒక బాలుడి పాత్ర కోసం అన్వేషిస్తున్న మెయ్యప్పకు మద్రాసు జనరల్‌ ఆస్పత్రిలో ఒక పిల్లాడు కనిపించాడు. అయితే అది మెయ్యప్పకు కాదు.. వాళ్లావిడకు. ఐదేళ్ల వయసులో పరమక్కుడికి చెందిన ఆ బాలుడికి సైనస్‌ సమస్య తలెత్తగా మద్రాసు జనరల్‌ ఆస్పత్రిలో చేర్చి వైద్యం ఇప్పిస్తున్నప్పుడు ఆ అబ్బాయి కలివిడిగా హాస్పిటల్ మొత్తం చుట్టి వస్తూ, అందరినీ పలకరిస్తూ, ముద్దుముద్దు మాటలు వల్లిస్తూ ఉండేవాడు. ఈ పిల్లాడికి వైద్యం అందించే డాక్టర్‌ వద్దకు మెయ్యప్ప చెట్టి భార్య కూడా వైద్య సలహా నిమిత్తం వస్తుండేది. ఈ బాలుడు ఆమెకు కూడా తారసపడి కబుర్లు చెప్పాడు. ఆమె తన భర్తకు ఈ అబ్బాయి గురించి చెప్పింది. ఆ కుర్రాడ్ని స్టూడియోకి తీసుకెళ్లి స్కీన్ర్‌ టెస్టులు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు స్టూడియో సిబ్బంది. ఇంకేముంది ఆ బాలుడు 'కళత్తూర్‌ కన్నమ్మ' సినిమాలో నటించాడు. ఆ బుడతడే మాస్టర్‌ కమల్‌ హాసన్‌. ఈ సినిమాను తెలుగులో 'మావూరి అమ్మాయి' పేరుతో ఎం.ఆర్‌.ఎం సంస్థ పేరిట మెయ్యప్ప కుమారులు కుమరన్, శరవణన్‌ అనువదించి 1960 అక్టోబరులో విడుదల చేశారు. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ బాలనటుడుగా రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు.

మన్మథలీలతో స్టార్​డం..

బాలచందర్‌ దర్శకత్వంలో 1976లో 'మన్మథ లీలై' అనే సినిమా వచ్చింది. అందులో కమల్‌ హీరో. ఈ సినిమాతోనే జయప్రద, వై.విజయ, హేమా చౌదరి తొలిసారి వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత వచ్చిన ముత్తురామన్‌ సినిమా 'ఒరు ఊధప్పు కన్‌ సిముట్టిగిరదు'లో కమల్, సుజాత నటించారు. కమల్‌కు మూడవసారి ఫిలింఫేర్‌ బహుమతి తెచ్చిపెట్టిన చిత్రమిది. అలాగే దర్శకుడు ముత్తురామన్‌కు కూడా ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. ఈ రెండు సినిమాలతో కమల్‌ తమిళ చిత్రరంగంలో స్థిరపడిపోయారు.

తెలుగులో కమల్‌ది మరోచరిత్ర..

కమల్‌ తెలుగులో నటించిన తొలి స్ట్రెయిట్‌ సినిమా 'అంతులేని కథ' (1976). అప్పుడే 'మన్మథలీల' డబ్బింగ్‌ వెర్షన్‌ కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాలు ఆంధ్రరాష్ట్రంలో శతదినోత్సవాలు చేసుకున్నాయి.

'మరోచరిత్ర' సినిమా రెండవ స్ట్రెయిట్‌ చిత్రం. బాలచందర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్‌ సరసన సరిత నటించగా, మాధవి ఒక ప్రత్యేక పాత్రను పోషించడం విశేషం. ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. గాయకుడు బాలుకి జాతీయ బహుమతి తెచ్చిపెట్టింది. కమల్‌ నటించిన ఎక్కువ తెలుగు సినిమాలకు బాలు డబ్బింగ్‌ చెప్పేవారు. తర్వాత కమల్​ మరెన్నో మరపురాని చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

కమల్‌ పాత్రల ప్రత్యేకతలు...

కమల్‌ హాసన్‌కు వైవిధ్యమైన పాత్రలు పోషించడమంటే సరదా. 'కల్యాణ రామన్‌' చిత్రంలో ఎత్తుపళ్లతో పల్లెటూరివాని పాత్రను పోషించాడు. 'రాజా పార్వై' చిత్రంలో అంధ వయోలనిస్టు పాత్రలో జీవించాడు. ఈ చిత్రానికి కమల్‌ స్క్రీన్ ప్లే అందించడం విశేషం. 'స్వాతిముత్యం'లో మానసిక వికలాంగునిగా, 'సాగర సంగమం'లో శాస్త్రీయ నృత్యకళాకారునిగా, 'నాయకుడు' సినిమాలో అండర్‌ వరల్డ్‌ డాన్‌గా ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నాడు. 'పుష్పక విమానం' సినిమాలో నిరుద్యోగ యువకునిగా, వారం రోజులపాటు భోగ భాగ్యాలు అనుభవించే అవకాశం వచ్చిన యువకునిగా నటించాడు. 'విచిత్ర సోదరులు' సినిమాలో మరుగుజ్జు అవతారం ఎత్తాడు. 'భామనే సత్యభామనే' చిత్రానికి శంతన్‌ పెనోయ్‌ దర్శకుడు. కానీ అతని పనితనం కమల్‌కు నచ్చలేదు. వెంటనే అతడిని తొలగించి తనే దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి సినిమాను హిట్‌ చేశాడు. 'గుణ' చిత్రంలో కమల్‌ది అద్భుతమైన పాత్ర. ప్రేమలో పడిన ఉన్మాదిగా నటించి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. 'ద్రోహి' చిత్రంలో ఉగ్రవాదాన్ని అణచివేసే పోలీసు అధికారిగా కమల్‌ నటన అపూర్వం. అలాగే 'భారతీయుడు' సినిమాలో స్వాతంత్య్ర సమరయోధుని పాత్రలో ముసలి వేషం, లంచగొండి అధికారిగా రెండవ వేషం వేసి రాణించిన గొప్ప నటుడు కమల్‌. 90వ దశకంలో కమల్‌ నటించిన ఎక్కువ చిత్రాలు పరాజయం పాలయ్యాయి.

పురస్కారాలు..

జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా 'మూండ్రాంపిరై' (వసంత కోకిల), 'నాయగన్‌' (నాయకుడు), 'ఇండియన్‌' (భారతీయుడు) సినిమాలో నటనకు మూడుసార్లు పురస్కారాలు అందుకున్నాడు. 'సాగరసంగమం', 'స్వాతిముత్యం' తెలుగు సినిమాలు ఆసియా చలన చిత్రోత్సవాలలో బహుమతులు గెలుచుకున్నాయి. ఫిలింఫేర్‌ బహుమతులను ఏకంగా పద్దెనిమిది సార్లు గెలుచుకున్న ఏకైక నటుడు కమల్‌. ఇతడు హీరోగా నటించిన ఆరు సినిమాలు ఆస్కార్‌ బహుమతి కోసం ప్రభుత్వ పక్షాన ఎంపికై, పోటీల్లో పాల్గొన్నాయి. 1990లో కేంద్ర ప్రభుత్వం కమల్‌ను పద్మశ్రీ పురస్కారంతోను, 2014లో పద్మభూషణ్‌ పురస్కారంతోను సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం 'కలైమామణి' బిరుదు ప్రదానం చేసింది. చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం కమల్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.

సంసారం..

కమల్‌ హాసన్‌ తొలుత నాట్య కళాకారిణి వాణీ గణపతిని వివాహమాడాడు. తర్వాత సారికను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో విడిపోయి, నటి గౌతమితో కొన్నాళ్లు సహజీవనం చేశాడు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. కమల్‌కు సారిక ద్వారా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకరు నటి శ్రుతి హాసన్‌ కాగా, రెండవ కూతురు అక్షర.

కమల్‌ హాసన్‌ వివాదాలకు కేంద్ర బిందువు కూడా! 'తేర్‌ మగన్‌' సినిమాలో ఓ వర్గాన్ని హింసను ప్రోత్సహించే వారిగా చూపి విమర్శలపాలయ్యాడు. 'హే రామ్‌' సినిమాలో సంఘ్‌ పరివార్‌ పాత్రను తక్కువ చేసి చూపారని ఆ సంఘ సభ్యులు గొడవ చేశారు. 'విశ్వరూపం' సినిమాలో ఓ మతాన్ని కించపరిచారనే ఆరోపణ దుమారం రేపింది.

ఇవీ చూడండి.. జీవితం గురించి త్రివిక్రమ్ 20 డైలాగ్​లు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY, MILWAUKEE COUNTY SHERIFF's DEPARTMENT
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Milwaukee – 6 November 2019
1. Clifton Blackwell walking into court
2.Wide of hearing
3. Tight of Blackwell
UPSOUND:  "Mr. Villalaz suffered second degree burns to his face, cheek and neck area, as well as injury to his eye due to a substance I note that the complaint alleges that they recovered muriatic acid at the home."
4. Shot of Judicial Court Commissioner Rosa Barillas and then quick pan to Blackwell:
UPSOUND: "Mr. Blackwell I am signing a no contact order. You're to have no contact with Mahud Villalaz, no contact in person, by phone, by mail and electronic device or through a third party. If you fail to abide by the no contact order, additional charges such as bell jumping could be issued against you. And the no contact order remains in effect during the entire time that this case is open. And the only person that can change a no contact order is the judge. Do you understand that?"  Blackwell: "Yes, I do."
5. Wide of courtroom
6. Tight of Blackwell
UPSOUND: "I am going to set the bail at $20,000 cash. Turn over to justice point for Level 5 supervision with G.P.S. monitoring. Twenty four hour curfews since I'm told that you're not employed."
7. Blackwell walking out
PHOTO COURTESY MILWAUKEE COUNTY SHERIFF'S DEPARTMENT - AP CLIENTS ONLY
Milwaukee, Wisconsin - date unknown
8. Undated booking shot of Clifton Blackwell
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Milwaukee – 5 November 2019
9. Various exteriors restaurant, outside of which the attack took place
STORYLINE:
Milwaukee prosecutors on Wednesday charged a 61-year-old man with a hate crime for allegedly throwing battery acid on a Hispanic man's face.
The decision from prosecutors means Clifton Blackwell could face an enhanced sentence if convicted of the charge of first-degree reckless injury. Prosecutors added the sentencing enhancers of hate crime and use of a dangerous weapon.
Mahud Villalaz suffered second-degree burns to his face Friday night when he says Blackwell confronted him over the way he parked near a restaurant. Villalaz says Blackwell threw acid at him after accusing him of being in the U.S. illegally and asking him why he was invading the country.
Villalaz is a U.S. citizen who immigrated from Peru.
During an initial appearance on Wednesday, a court commissioner set cash bail at $20,000 for Blackwell.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.