ETV Bharat / sitara

కమల్​కు సర్జరీ.. ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్​ - కమల్​కు లెగ్​ సర్జరీ

లోకనాయకుడు​ కమల్​ హాసన్​.. కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యిందని ఆయన కుమార్తెలు శ్రుతి హాసన్​, అక్షరా హాసన్​లు ట్విట్టర్​లో వెల్లడించారు.

Kamal Haasan undergoes leg surgery, will be discharged in four-five days
కమల్​కు సర్జరీ.. ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్​
author img

By

Published : Jan 19, 2021, 1:00 PM IST

సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. చెన్నైలోని శ్రీరామచంద్ర ఆసుపత్రిలో కమల్ హాసన్‌కు చేసిన శస్త్రచికిత్స విజయవంతమైందని ఆయన కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షరా హాసన్ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

ప్రస్తుతం కమల్‌ పరిస్థితి బాగుందని, నాలుగైదు రోజుల్లోనే ఇంటికి వచ్చేస్తారని వారివురూ పేర్కొన్నారు. కమల్ హాసన్‌ కోసం ప్రార్థించిన వారికి, మద్దతు ఇచ్చిన వారికి శ్రుతి హాసన్, అక్షర హాసన్‌ కృతజ్ఞతలు తెలిపారు. కాలి శస్త్రచికిత్స నుంచి తమ తండ్రి వేగంగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. విశ్రాంతి తీసుకుని కోలుకున్న తర్వాత కమల్ హాసన్ ప్రజలందరినీ కలుస్తారని శ్రుతి, అక్షర చెప్పారు.

ఇదీ చూడండి: 'పెళ్లికి ముందే మా ఇద్దరికి బ్రేకప్​.. కానీ!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.