ETV Bharat / sitara

కమల్​హాసన్​​ పుట్టినరోజున సినీప్రియులకు కానుక - లోకేశ్​ కనగరాజ్​ వార్తలు

విలక్షణ నటుడు కమల్​హాసన్​ – దర్శకుడు లోకేశ్​ కనగరాజ్​ కాంబినేషన్​లో ఓ చిత్రం తెరకెక్కనుంది. కమల్​ పుట్టినరోజును పురస్కరించుకొని ఆ సినిమాకు సంబంధించిన ఓ టీజర్​ను నవంబరు 7న చిత్రబృందం విడుదల చేయనుందని సమాచారం.

'Kamal Haasan 232': A glimpse of Ulaganayagan Kamal Haasan from his next to be released on his birthday?
లోకనాయకుడు బర్త్​డేకు కొత్త సినిమా టీజర్​
author img

By

Published : Oct 31, 2020, 9:09 AM IST

లోకనాయకుడు కమల్​హాసన్​ నుంచి సినీప్రియులకు ఓ అపురూప కానుక అందబోతుంది. నవంబరు 7న ఆయన పుట్టినరోజు సందర్భంగా 'కమల్​ 232'వ చిత్రం నుంచి ఓ చిన్న టీజర్​ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. విలక్షణ దర్శకుడు లోకేశ్​ కనగరాజ్​ తెరకెక్కించనున్న చిత్రమిది. కమల్​ స్వీయ నిర్మాణంలో రూపొందనుంది. త్వరలోనే రెగ్యులర్​ షూటింగ్​ ప్రారంభం కాబోతోంది.

ఈ నేపథ్యంలో కమల్​పై ఇటీవలే టెస్ట్​షూట్​ చేసినట్లు సమాచారం. ఇప్పుడు దీనికి సంబంధించిన విజువల్స్​తోనే చిన్న టీజర్​ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో కమల్​ను మునుపెన్నడూ చూడని విధంగా చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారట దర్శకుడు లోకేశ్​.

ఇప్పటికే స్క్రిప్ట్​, పూర్వ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. నవంబరు నెలాఖరు లేదా డిసెంబరు నుంచి సినిమా సెట్స్​పైకి తీసుకెళ్లనున్నారని, రెండు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కమల్​ చేస్తున్న 'భారతీయుడు 2' షూటింగ్​ త్వరలో పునఃప్రారంభం కానుంది. ఈ చిత్రానికి శంకర్​ దర్శకత్వం వహిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.