చరిత్రకు సజీవ సాక్ష్యాలు కోటలు, ఆనాటి రాజుల ఉపకరణాలు.. మరి అలాంటి నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించాలంటే.. ఆ కాలంలోని కట్టడాలు, జీవన విధానం ప్రతిబింబించేందుకు భారీ సెట్లు వేస్తుంటారు దర్శక నిర్మాతలు. కోట్ల ఖర్చుకూ వెనుకాడరు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న బాహుబలి సినిమా సైతం అద్భుతంగా రావడానికి ఈ సెట్లే కీలకంగా వ్యవహరించాయి. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'కళంక్' చిత్రంలోనూ ఇలాంటి ఓ సెట్ కనువిందు చేయనుంది. ప్రేక్షకులు, అభిమానులకు ఈ సినిమా చిత్రీకరణ చేసిన ప్రాంతం, తెరకెక్కించేందుకు పడిన కష్టం తెలపాలనుకుంది చిత్రబృందం. ఓ చిన్నపాటి వీడియోను విడుదల చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ఈ వీడియోలో వరుణ్ ధావన్ సెట్ విశేషాలు చెప్తూ కనిపిస్తే.. ఆ సెట్‌ను సందర్శించిన ప్రముఖులు అబ్బురపడ్డారు. హుస్నాబాద్‌లో 1945 కాలాన్ని తలపిస్తూ ఓ టౌన్‌షిప్‌ను రూపొందించారు. దాదాపు 700 మంది.. మూడు నెలలు కష్టపడి ఈ అందమైన సెట్స్‌ను రూపొందించినట్లు తెలిపింది చిత్రబృందం.
- భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఓ యువరాణికి, ఓ సాధారణ వ్యక్తికి మధ్య పుట్టిన ప్రేమకథ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రూప్ అనే యువరాణి పాత్రలో ఆలియా నటించింది. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
- సినిమాకు అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ ప్రముఖ నటులు సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆలియా భట్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.