Kajol Coronavirus: అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు కాజోల్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. అయితే జలుబు కారణంగా ఎర్రగా మారిన నా ముక్కును మీకు చూపించాలని అనుకోవడం లేదు. బదులుగా ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన నవ్వును చూడండి" అంటూ తన కూతురు నైసా దేవ్‌గణ్ ఫొటోను షేర్ చేశారు కాజోల్.
![Kajol Coronavirus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14322644_1.jpg)
కాజోల్.. చివరిగా 2021లో వచ్చిన్ నెట్‌ఫ్లిక్స్ ఫ్యామిలీ డ్రామా 'త్రిభంగ'లో అలరించారు. ఆమె భర్త, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ కూడా వెబ్‌సిరీస్‌లో అరంగేట్రం చేశారు. ఆయన నటించిన 'రుద్ర' సిరీస్ ట్రైలర్ ఇటీవలే విడుదలై ఆకట్టుకుంటోంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: అవంతిక రూటే సెపరేటు.. ఆ వెబ్ సిరీస్‌తో ఎంట్రీ