టాలీవుడ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'మహాసముద్రం'. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి ముగ్గురు స్టార్ హీరోయిన్లు తిరస్కరించారని సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, శ్రుతిహాసన్‌ను సంప్రదించగా ఈ చిత్రంలో చిందేయడానికి ఆసక్తి చూపలేదని తెలిసింది.
లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లు. ఈ ద్విభాషా చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.