హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతోన్న 'భారతీయుడు-2' షూటింగ్లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా అజ్మీర్‌లోని సూఫీ సెయింట్ కావాజా మొయినుద్దీన్ దర్గాను తల్లితో కలిసి సందర్శించింది. చాదర్, పూలు సమర్పించింది. తను నటించే కొత్త సినిమాలు హిట్ కావాలని ప్రత్యేక ప్రార్ధనలు చేసింది.
1996లో వచ్చిన 'భారతీయుడు'కు సీక్వెల్‌గా రూపొందుతోంది 'భారతీయుడు-2'. కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్నాడు. సేనాపతి అనే 90 ఏళ్ల వృద్ధుడి పాత్ర పోషిస్తున్నాడు. రాజస్థాన్ కిషన్ఘర్లోని పూల్ మహల్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: లాల్బాగ్ గణేశునికి కాజల్ ప్రత్యేక పూజలు