ETV Bharat / sitara

ఎట్టకేలకు తన ప్రేమకథ చెప్పిన కాజల్! - kajal agarwal latest news

హీరోయిన్ కాజల్.. ఎట్టకేలకు తన ప్రేమకథ గురించి చెప్పింది. తన భర్త గౌతమ్​, పదేళ్ల ముందు నుంచే తెలుసని వెల్లడించింది.

Kajal Aggarwal reveals her love story
కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూ
author img

By

Published : Nov 2, 2020, 6:15 PM IST

యువ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను ఇటీవలే పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్.. తొలిసారి తన ప్రేమకథ గురించి చెప్పింది. వివాహం జరిగిన రెండు రోజుల తర్వాత ఓ వెబ్​సైట్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. అంతకు ముందు కాజల్​కు శుభాకాంక్షలు చెబుతూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

"మా ఇద్దరికి పదేళ్ల ముందు నుంచే పరిచయముంది. ఏడేళ్ల నుంచి స్నేహితులుగా ఉన్నాం. మూడేళ్లుగా డేటింగ్​లో ఉన్నాం. ఈ ఏడాది ప్రారంభంలో గౌతమ్, నాకు ప్రపోజ్ చేశారు. అప్పుడు చాలా హృదయపూర్వక, భావోద్వేగ సంభాషణ జరిగింది" అని కాజల్ వెల్లడించింది.

Kajal Aggarwal reveals her love story
భర్త గౌతమ్​తో కాజల్ అగర్వాల్

ఈ ఏడాది ఏప్రిల్​లో కాజల్ తల్లిదండ్రులను కలిసిన గౌతమ్.. పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారట. అనంతరం వాళ్లు ఒప్పుకున్న తర్వాత ఇటీవలే కాజల్-గౌతమ్​ల పెళ్లి జరిగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.