మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా 'ఆచార్య'. కరోనా కారణంగా ఇప్పటికే చిత్రీకరణ వాయిదా పడింది. ఇందులో తొలుత హీరోయిన్గా అనుకున్న త్రిష.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంది. ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారంటూ కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై స్పష్టతనిచ్చిందీ భామ. 'జనతా కర్ఫ్యూ' సందర్భంగా ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన కాజల్.. చిరు పక్కన మరోసారి నటిస్తున్నట్లు చెప్పింది.
-
. @MsKajalAggarwal is the female lead in #Chiru152. She confirmed it in her Instagram live. #Megastar #JanataCurfew #CoronavirusPandemic pic.twitter.com/KNMyhB8rhl
— # Manoj (@manojvalluri) March 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">. @MsKajalAggarwal is the female lead in #Chiru152. She confirmed it in her Instagram live. #Megastar #JanataCurfew #CoronavirusPandemic pic.twitter.com/KNMyhB8rhl
— # Manoj (@manojvalluri) March 22, 2020. @MsKajalAggarwal is the female lead in #Chiru152. She confirmed it in her Instagram live. #Megastar #JanataCurfew #CoronavirusPandemic pic.twitter.com/KNMyhB8rhl
— # Manoj (@manojvalluri) March 22, 2020
కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో తన 152వ సినిమా టైటిల్‌ను లీక్ చేశాడు మెగాస్టార్. అధికారికంగా ప్రకటించకుండానే తమ చిత్రానికి 'ఆచార్య' పేరు పెట్టినట్లు చెప్పేశాడు. ఇప్పుడు కాజల్ అలానే ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండానే తను ఈ ప్రాజెక్టులో నటిస్తున్నట్లు ఖరారు చేసింది.
ఇది చదవండి: అమ్మ దగ్గర ఆవకాయ చేయడం నేర్చుకుంటున్న హీరో