ETV Bharat / sitara

కుట్లుఅల్లికలతో కాజల్​ కాలక్షేపం ​ - కాజల్​ అగర్వాల్​ లేటెస్ట్​ న్యూస్​

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటికే పరిమితమైన స్టార్​ హీరోయిన్​ కాజల్​ అగర్వాల్​..ఇప్పుడీ విరామ సమయంలో కుట్లుఅల్లికలతో కాలక్షేపం చేస్తోందట. ప్రస్తుతం ఆమె నూలు దారంతో అందమైన అల్లికల్ని ప్రయత్నిస్తున్నట్లు ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. దీంతో పాటు ఓ చక్కటి సందేశాన్ని కాజల్​ రాసుకొచ్చింది.

Kajal Agarwal spending her time with stitches
కుట్లుఅల్లికలతో కాలక్షేపం చేస్తోన్న కాజల్​
author img

By

Published : May 2, 2021, 7:17 AM IST

Updated : May 2, 2021, 8:26 AM IST

"కరోనా వ్యాప్తి కారణంగా ప్రస్తుతం పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మన చుట్టూ ఓ నిస్సహాయత, తెలియని ఆందోళన కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదోక పనిపై మనస్సును కేంద్రీకరించడం ద్వారా మానసిక ఒత్తిడిని జయించవచ్చు" అంటోంది నటి కాజల్‌ అగర్వాల్‌. మాటల్లో చెప్పడమే కాదు.. దీన్ని తాను స్వయంగా అనుసరిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలియజేసింది.

"ఇప్పుడున్న పరిస్థితుల్లో మానసిక ఒత్తిడిని దరి చేరనీయకుండా చూసుకోవడం ముఖ్యం. ఇందుకోసం మన మనస్సులను ఏదోక పనిపై కేంద్రీకరించాలి. అది ఏదైనా కావొచ్చు. సృజనాత్మకంగా అనుభూతి చెందడం ఈ సమయంలో చాలా అవసరం. నేను ఇటీవల అల్లికలు చేస్తున్నా. ఇది నాకు విశ్రాంతిని కలిగించడం సహా మానసిక క్షేమాన్ని అందిస్తోంది. ఇతరుల కోసం ఏదైనా సృష్టించడం నిజంగా చికిత్సా విధానం. మరి ఈ ఖాళీ సమయంలో ఇంట్లో ఉండి మీరు ఏమి చేస్తున్నారు?" అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది కాజల్‌. ఆమె ప్రస్తుతం చిరంజీవికి జోడీగా 'ఆచార్య'లో నటిస్తోంది.

ఇదీ చూడండి: కల్యాణ్​రామ్​ కొత్త సినిమా 'ఎమిగోస్​'!

Last Updated : May 2, 2021, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.