అభిమానులకు శుభవార్త చెప్పింది అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్. తన పెళ్లిపై వస్తోన్న పుకార్లకు చెక్ పెట్టింది. ముంబయికి చెందిన గౌతమ్ అనే యువ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనున్నట్లు స్పష్టం చేసింది. అక్టోబర్ 30న ముంబయిలో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య తమ వివాహ వేడుక జరుపుకోనున్నట్లు తెలిపింది.
"గౌతమ్ కిచ్లును అక్టోబరు 30న వివాహం చేసుకోబోతున్నానని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముంబయిలో ఆత్మీయుల సమక్షంలో మా పెళ్లి వేడుక జరగబోతోంది. జీవితంలోని ఈ కొత్త ఆరంభం కోసం మేం ఎంతో థ్రిల్లింగ్‌గా ఎదురుచూస్తున్నాం. మీ అందరూ కూడా ఈ ఆనందంలో భాగస్వామ్యం అవుతారని ఆశిస్తున్నా. ఇన్నేళ్లుగా మీరంతా నాపై కురిపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఈ కొత్త ప్రయాణంలో మేం మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం. పెళ్లి తర్వాత కూడా నేను నాకు ఎంతో ఇష్టమైన నటనను కొనసాగిస్తా. నా ప్రేక్షకులకు వినోదం అందిస్తా. మరోసారి మీ అమితమైన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా."
-కాజల్ అగర్వాల్, హీరోయిన్.
ప్రముఖ కథానాయకుడు కమల్ హాసన్-దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'భారతీయుడు 2'లో కాజల్ కథానాయిక పాత్ర పోషిస్తోంది. అదేవిధంగా దుల్కర్ సల్మాన్, అదితిరావు హైదరి జంటగా నటిస్తున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. మంచు విష్ణుతో కలిసి 'మోసగాళ్లు' సినిమా కోసం పనిచేస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది.
ఇదీ చూడండి కాజల్‌కు కాబోయే భర్త ఇతడేనా?