వన్నె తరగని అందం అంటారు కదా! ఈ మాట హీరోయిన్ కాజల్‌కు అక్షరాలా వర్తిస్తుంది. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 11 సంవత్సరాలు అవుతున్నా... ఇప్పటికీ తన అందంతో మాయ చేస్తోందీ ముద్దుగుమ్మ. అందం మాత్రమే కాదు.. అంతకుమించిన అభినయమూ ఉందంటూ తన నటనతో నిరూపిస్తోంది. కుర్రకారు కలల రాకుమారిగా నిలిచిన కాజల్ అగర్వాల్.. నేడు 34 పుట్టినరోజు జరుపుకుంటోంది.
టాలీవుడ్‌కు పరిచయమైన ‘లక్ష్మీకల్యాణం’, ‘చందమామ’ సినిమాలతోనే తానెంటో నిరూపించింది కాజల్. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తెలుగుతో పాటు, తమిళంలోనూ సత్తా చాటింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’ ఆమె స్థాయిని మరింత పెంచింది. దక్షిణాదిలో అగ్రహీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
‘ఆర్య 2’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘బృందావనం’, ‘తుపాకీ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ఎవడు’, ‘టెంపర్’, 'ఖైదీ నెం.150' చిత్రాలు కాజల్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కొంతకాలంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలపై దృష్టిపెడుతోంది కాజల్. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అ!’ సినిమాలతో తనలో విభిన్న కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. జనతా గ్యారేజ్ చిత్రంలో ' నేను పక్కా లోకల్' అంటూ ప్రత్యేక గీతాలకూ సై అంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పంజాబీ కుటుంబానికి చెందిన కాజల్ అగర్వాల్.. 1985లో ముంబయిలో జన్మించింది. వినయ్ అగర్వాల్, సుమన్ అగర్వాల్ తల్లిదండ్రులు. మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసిన ఈ భామ.. ‘క్యూ హో గయా నా’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది.
సవాళ్లని స్వీకరించడమన్నా, సాహసాలు చేయడమన్నా ఇష్టమని చెబుతోంది కాజల్. ఇటీవలే మేకప్ తీసేసి ఫొటోలకి పోజులిచ్చి తన ప్రత్యేకతను ప్రదర్శించింది. కెమెరా ముందే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ తాను ఇలాగే ఉంటానంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రస్తుతం ‘క్వీన్’ రీమేక్‌తో పాటు, టాలీవుడ్లో శర్వానంద్ సరసన 'రణరంగం'లో హీరోయిన్గా నటిస్తోంది. తమిళంలో కమల్‌హాసన్ 'భారతీయుడు-2', జయం రవి 'కోమలి' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇది చదవండి: మేకప్ లేకుండా కాజల్ 'అందమైన' పాఠాలు