kacha badam singer accident: 'కచ్చా బాదమ్' పాటతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు పశ్చిమబంగాల్‌కు చెందిన భూబన్. ఆ ఒక్క పాటతో ఆయన జీవితమే మారిపోయింది. విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. తాజాగా ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అసలు ఏమైందంటే?
కచ్చాబాదమ్ పాటతో వచ్చిన రెమ్యునరేషన్‌తో సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నారు భుబన్. స్వయంగా తానే కారును నేర్చుకునే క్రమంలో యాక్సిడెంట్‌కు గురయ్యారు. ఛాతీలో బలమైన గాయం కావడం వల్ల కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం భూబన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
వస్తువులకు బదులు పల్లీలిస్తూ..
‘కచ్చా బాదామ్ పాట’ భూబన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పశ్చిమ బంగాల్‌లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామం.. భుబన్ స్వస్థలం. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. పచ్చి పల్లీలు అమ్ముకుంటూ భూబన్ జీవనం కొనసాగించేవారు. పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ.. వాటిని జంక్ షాపుల్లో అమ్మగా వచ్చే ఆదాయంతో జీవనం కొనసాగించేవారు.
కిడ్నాప్ చేస్తారేమోనని భయంగా ఉంది..
ఇకపై పల్లీలు అమ్ముకోనని, సింగింగ్ కెరీర్‌లోనే కొనసాగుతానని ఇటీవల భుబన్ తెలిపారు. ఈ క్రేజ్ వల్ల తనను కిడ్నాప్ చేస్తారేమోనని భయంగా ఉందంటూ ఇటీవల ఆయన పేర్కొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: శివరాత్రి స్పెషల్.. 'భోళాశంకర్' స్పెషల్ వీడియో రిలీజ్