తెలుగులో బ్లాక్‌బస్టర్ అయిన 'అర్జున్ రెడ్డి'ని బాలీవుడ్లో 'కబీర్ సింగ్' పేరుతో తెరకెక్కించారు. షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కబీర్ సింగ్ మాతృక అర్జున్ రెడ్డి స్క్రిప్ట్‌కు స్వల్ప మార్పులు చేసి ఈ సినిమాను రూపొందించారు. హిందీలోనూ 'అర్జున్ రెడ్డి' టైటిల్ పెట్టాలనుకున్నారు. కానీ తర్వాత కబీర్ సింగ్‌గా పేరు మార్చారు. తెలుగు చిత్రంలో కులం కారణంతో హీరో ప్రేమను కథానాయిక తండ్రి తిరస్కరిస్తాడు. హిందీలో పొగ తాగే అలవాటు నచ్చక కథానాయకుడు ప్రేమను తిరస్కరించేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేశారు.
మాతృకను తెరకెక్కించినా సందీప్ రెడ్డి వంగా.. కబీర్ సింగ్‌కు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మొదట హీరోగా రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్లను పరిశీలించినా చివరికి ఆ అవకాశం షాహిద్ కపూర్‌నే వరించింది.
ఇది చదవండి: 200 కోట్ల క్లబ్లో సల్మాన్‌ఖాన్ 'భారత్'