ETV Bharat / sitara

నెట్టింట దూసుకెళ్తున్న 'కబీర్ సింగ్' బ్రేకప్ పాట - షాహిద్ కపూర్

ఇటీవలే విడుదలైన 'కబీర్ సింగ్' లోని 'బేఖయాలి మే' పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. షాహిద్- కియారా జంటగా నటించిన ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నెట్టింట దూసుకెళ్తున్న 'కబీర్ సింగ్' బ్రేకప్ పాట
author img

By

Published : May 26, 2019, 5:23 PM IST

Updated : May 26, 2019, 11:39 PM IST

తెలుగు ట్రెండ్‌సెట్టర్‌ సినిమా ‘అర్జున్‌ రెడ్డి’ని హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో తీస్తున్నారు. షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలోని 'బేఖయాలీ మే' అంటూ సాగే విరహ గీతం సంగీత ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ పాట యూట్యూబ్‌లోకి వచ్చిన రెండు రోజుల్లోనే 18 మిలియన్లకు పైగా వీక్షణలను, అర మిలియన్‌కు పైగా లైకులను దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా షాహిద్‌ - కియారా మధ్య వచ్చే ఘాటైన ముద్దు సన్నివేశాలు యువతను ఆకర్షిస్తున్నాయి. భగ్న ప్రేమికుడిగా షాహిద్‌ కనబర్చిన హావభావాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ గీతానికి ఇర్షాద్‌ కమిల్‌ సాహిత్యాన్ని అందించగా.. స్వరకర్త సాచేత్‌ టాండన్‌ ఎంతో హృద్యంగా ఆలపించారు.

మాతృకను తెరకెక్కించిన సందీప్‌ రెడ్డి వంగానే హిందీ వెర్షన్‌కు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Jammu, May 26 (ANI): Directorate of Tourism Jammu held a Run for women to promote fitness among women in Jammu. The run was flagged off by O. P. Bhagat Director Tourism Jammu. The run started from famous Mubarak Mandi complex and commenced at Golf course. Women of every age participated in the run in large number. A participant said, "Women in Jammu are becoming more and more health conscious and these kind of events help promote fitness among women."

Last Updated : May 26, 2019, 11:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.