ETV Bharat / sitara

ప్రభాస్​-నాగ్​అశ్విన్​ సినిమా.. సంగీత దర్శకుడు మారాడా? - prabhas nag ashwin movie music director

prabhas nag ashwin movie music director: నాగ్​అశ్విన్​ దర్శకత్వంలో ప్రభాస్​ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'ప్రాజెక్ట్​ K'. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న మిక్కీ జె మేయర్​ స్థానంలో 'కబాలి' ఫేమ్​ సంతోష్​ నారాయణ్​ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది(prabhas nag ashwin movie update).

prabhas
ప్రభాస్​
author img

By

Published : Nov 22, 2021, 9:53 PM IST

prabhas nag ashwin movie music director: స్టార్​ హీరో ప్రభాస్​ నటిస్తున్న సినిమాల్లో 'ప్రాజెక్ట్​ K'(వర్కింగ్​ టైటిల్​) ఒకటి. ఇప్పుడీ చిత్రం గురించి ఓ వార్త నెట్టింట్లో ప్రచారం సాగుతోంది. ఈ మూవీకి ముందుగా మిక్కీ జె మేయర్​ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఓ కోలీవుడ్​ మ్యూజిక్​ డైరెక్టర్​ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి(prabhas nag ashwin movie update). ​తమిళంలో 'కబాలి', 'కాలా', 'జిగర్తాండ' సహా పలు సినిమాలకు సంగీతం అందించిన సంతోష్​ నారాయణ్​ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

మరి మిక్కీని తప్పించి సంతోష్​ను తీసుకున్నారా? లేదా వీరిద్దరూ కలిసి ఈ సినిమా కోసం పనిచేయనున్నారా? అనేది స్పష్టత లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

ఈ మూవీకి నాగ్​ అశ్విన్​ దర్శకుడు. సైన్స్​ ఫిక్షన్​ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్​ను కొంత కాలం క్రితం ప్రారంభించి అమితాబ్​ బచ్చన్​పై(prabhas and amitabh bachchan movie) కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ప్రభాస్​ త్వరలోనే సెట్స్​లోకి అడుగుపెట్టనున్నారు. డార్లింగ్​కు జోడీగా దీపికా పదుకొణె నటించనుంది.

ఇదీ చూడండి: Radheshyam story: ప్రభాస్​ 'రాధేశ్యామ్​' కథ లీక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.