'ఖైదీ' సినిమాతో బంపర్ హిట్ అందుకున్న కార్తీ... అదే జోరులో మరో సినిమా ప్రారంభించాడు. ఇందులో జ్యోతిక కీలక పాత్ర పోషించనుంది. తొలిసారి తన వదినతో నటిస్తుండటం ఆనందంగా ఉందన్న కార్తీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ సినిమాలో జ్యోతిక తనకు అక్క పాత్ర పోషించనుందని తెలిపాడు.
"సెట్‌కు వచ్చే వరకే ఆమె నాకు వదిన. ఒక్కసారి షూటింగ్‌కు వచ్చాక అక్కడ మేము నటీనటులగానే ఉంటాం. కెమెరా ముందు ఇద్దరికీ పాత్రలు మాత్రమే గుర్తుకు వస్తాయి. వదిన నా కంటే చాలా సీనియర్. సినిమాకు సంబంధించిన చాలా విషయాలు ఆమె నుంచి నేర్చుకుంటున్నా".
- కార్తీ, సినీ హీరో.
ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. తమిళంలో దృశ్యం సినిమాను తెరకెక్కించిన జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా మణిరత్నంతో మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడు కార్తీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: సాహో తర్వాత సందిగ్ధంలో ప్రభాస్..!