హాలీవుడ్ హిట్ సిరీస్ జుమాంజీలో మూడోభాగం రాబోతోంది. 'జుమాంజీ ది నెక్స్ట్ లెవెల్' పేరుతో తెరకెక్కిన ఈ సినిమా హిందీ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీ డిసెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్(రాక్) ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఆంగ్లంతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
కొలంబియా పిక్చర్స్, సెవెన్ బక్స్ ప్రొడక్షన్స్ తదితర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాయి.
1995లో జుమాంజీ మొదటి భాగం విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత 2017లో వచ్చిన రెండో భాగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా జుమాంజీ ది నెక్స్ట్ లెవెల్ విడుదలకు సిద్ధమైంది.
![jumanji movie poster released in hindi. 13th december will be rease the movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5098092_sr.jpg)
ఇదీ చూడండి:ముంబయిలో అదిరిన హాలీవుడ్ గాయనుల సందడి