బాలీవుడ్ ప్రముఖ నటులు కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్.. 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమాతో మరోసారి జోడీగా కనువిందు చేసేందుకు సిద్ధమయ్యారు. విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఐదేళ్ల క్రితం వీరిద్దరూ 'క్వీన్'లో కలిసి నటించారు. 'సైజ్ జీరో' చిత్రంతో ఆకట్టుకున్న ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహించాడు. ఈ నెలలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఒక హత్య కేసులోని నిందితుల పాత్రల్లో కంగన, రాజ్‌కుమార్ కనిపించనున్నారు. మతిస్థిమితంలేని బాబీ అనే మహిళ పాత్రను కంగన పోషించింది.
ఈ సినిమాకు ముందు ‘మెంటల్ హై క్యా’ టైటిల్‌ను నిర్ణయించారు. దీనిపై ఇండియన్ మెంటల్ హెల్త్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత టైటిల్‌ను 'జడ్జిమెంటల్ హై క్యా'గా మార్చారు.
ఇది చదవండి: క్వీన్ ఇక 'మెంటల్' కాదు 'జడ్జ్‌మెంటల్'