ETV Bharat / sitara

దుబాయ్​ నుంచి తారక్ వచ్చాకే 'ఆర్​ఆర్​ఆర్​'! - NTR 20 years completed

చిత్రపరిశ్రమలో ఎన్టీఆర్​ 20 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారని ఆయన అభిమానులు సోషల్​మీడియాలో ట్రెండింగ్​ చేస్తూ.. కామన్ ​డీపీలను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్​ పర్యటనలో ఉన్న ఎన్టీఆర్​.. హైదరాబాద్​ తిరిగి వచ్చాక ఆర్​ఆర్​ఆర్​ షూటింగ్​లో పాల్గొననున్నారు.

Jr NTR went to Dubai with his family, will soon take part in the RRR shooting
దుబాయ్​ నుంచి వచ్చాకే 'ఆర్​ఆర్​ఆర్​' షూటింగ్​!
author img

By

Published : Nov 17, 2020, 7:55 AM IST

Updated : Nov 17, 2020, 9:43 AM IST

యంగ్​టైగర్​ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి ఇరవై ఏళ్లు అయింది. 'నిన్ను చూడాలని' అంటూ నూనూగు మీసాలతో కనిపిస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. అనతికాలంలోనే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆటుపోట్లనీ ఎదుర్కొన్నారు. మొత్తంగా పడి లేచిన కెరటాన్ని గుర్తు చేసే ఎన్టీఆర్‌ ప్రయాణం చాలా ప్రత్యేకమైనది.

ఎన్టీఆర్‌ 20 ఏళ్ల ప్రయాణం గురించి ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక డీపీలతో సందడి చేస్తున్నారు. కొన్నాళ్లుగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రీకరణతో బిజీగా గడుపుతూ వచ్చిన ఎన్టీఆర్‌, ఇటీవలే కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లారు. అక్కడి నుంచి రాగానే మళ్లీ హైదరాబాద్‌లోనే 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రీకరణతో బిజీ కాబోతున్నారు. అది పూర్తి కాగానే, త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించనున్న చిత్రం కోసం రంగంలోకి దిగుతారు.

Last Updated : Nov 17, 2020, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.