ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్', హాలీవుడ్​ ఎంట్రీ గురించి ఎన్టీఆర్ మాటల్లో

కొవిడ్ కారణంగా ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న స్టార్ హీరో ఎన్టీఆర్.. ఆర్ఆర్​ఆర్, తన హాలీవుడ్​ ఎంట్రీ, తర్వాత చేయబోయే ప్రాజెక్టుల గురించి వెల్లడించారు. 'ఆర్ఆర్ఆర్'ను ఓటీటీలకు అమ్మే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

NTR First Interview about RRR
ఎన్టీఆర్
author img

By

Published : May 12, 2021, 6:05 PM IST

Updated : May 12, 2021, 6:19 PM IST

కరోనా వల్ల దేశం మొత్తం అతలాకుతలమైపోతోంది. సినిమా పరిశ్రమ ఇందుకు మినహాయింపేం కాదు. షూటింగ్​లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.. కొత్త చిత్రాల విడుదలలు వాయిదా పడ్డాయి. సినిమా తారలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. అందులో జూ.ఎన్టీఆర్‌ కూడా ఒకరు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన ఓ ఆంగ్ల ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తిరమైన విషయాలు పంచుకున్నారు. రాజమౌళికి జక్కన్న అనే పేరు పెట్టింది తానే అన్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ‘పాన్‌ ఇండియా’ సినిమా గురించి మాట్లాడుతూ.. పాన్‌ ఇండియా అనే పదం అంటే తనకు నచ్చదని.. ఒక మంచి సినిమాను దేశంలో ఉన్న అనేక భాషల్లో చూపించడమే తమ ఉద్దేశమని అన్నారు. పాన్‌ అంటే వంట పాత్ర తనకు గుర్తుకొస్తుందని ఆయన చెప్పారు.

NTR
ఎన్టీఆర్

'ఆర్‌ఆర్‌ఆర్‌' పనులు 2018 నవంబర్‌లోనే మొదలయ్యాయి. రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే కదా.. ఆయన పరిపూర్ణత లేకుంటే అసలే ఒప్పుకోరు. అందుకే తన సినిమాకు చాలా సమయం తీసుకుంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో దాదాపు మెజార్టీ భాగం చిత్రీకరణ పూర్తయింది. కరోనా వల్ల నెలల పాటు వాయిదా పడింది.

* 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఓటీటీలో విడుదల చేసే ఆలోచన ఏమాత్రం లేదు. బాహుబలి, జురాసిక్‌ పార్క్‌, అవెంజర్స్‌ వంటి సినిమాలను ఓటీటీలో చూస్తారా? ఇది కూడా అంతే. కొన్ని సినిమాలను థియేర్లలలోనే చూడాలి. ఓటీటీలో విడుదల చేయాలనే ఉద్దేశం లేదు. పెద్ద స్క్రీన్‌పై సమూహంగా చూస్తూ ఆస్వాదించే సినిమా ఇది అని తారక్‌ అన్నారు.

* 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. నిజమైన హీరోల గురించి దేశవ్యాప్తంగా తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం ఎంతో పరిశోధన చేశామని తారక్‌ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ కథలు తన పిల్లలకు కూడా చెప్తున్నట్లు చెప్పారు. ఇక ఇప్పటి వరకూ సినిమా డైరెక్ట్‌ చేయడం గురించి ఆలోచించలేదని.. అయితే.. మంచి కథలను నిర్మించే ఆలోచన ఉందన్నారు.

RRR movie poster
ఆర్ఆర్ఆర్ మూవీ పోస్టర్

* హాలీవుడ్‌లో ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. అక్కడ అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు.. నేను కూడా అంతే అని తన మనసులోని మాట బయటపెట్టారు. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రాజమౌళి, రామారావు, రామ్‌చరణ్‌ అనేది వర్కింట్‌ టైటిల్‌ మాత్రమే అన్నారు. అయితే, ఆ పేరు బాగా జనాల్లోకి వెళ్లడంతో ఆ పేరుతోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ‘రౌద్రం, రణం, రుధిరం’ అని అర్థం వచ్చేలా రాజమౌళి ఖరారు చేశారన్నారు.

తన తర్వాతి సినిమా కొరటాల శివతో చేస్తున్నానని ఖరారు చేశారు. గతంలో ‘జనతా గ్యారేజ్‌’ చేశామని.. అది పెద్ద బ్లాక్‌బస్టర్‌హిట్‌ అయిందని గుర్తు చేశారు. ఆర్ఆర్‌ఆర్‌ పూర్తవగానే ఆ సినిమా మొదలు పెడతామన్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్‌ నడుస్తుందన్నారు. కొరటాలతో సినిమా అనంతరం ప్రశాంత్‌నీల్‌తో మరో సినిమా చేస్తున్నట్లు చెప్పారు. క్వారంటైన్‌తో కుటుంబంతో సమయం ఆస్వాదిస్తున్నాను. అమ్మా, భార్య, పిల్లలు.. వాళ్లతో ఉండటం ఓ ఎమోషన్‌ అని ఎన్టీఆర్ అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : May 12, 2021, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.