లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను చిరంజీవి నేతృత్వంలోని కరోనా క్రైసిస్ ఛారిటీ ఆదుకుంటున్న వేళ.. ఓ సినీ కార్మికుడు మాత్రం ఏడాది నుంచి పస్తులుంటున్నాడు. మేడ్చల్ నివాసి నరసింహం 50 ఏళ్ల కిందట సినిమాపై ప్రేమతో కృష్ణానగర్లో వాలిపోయాడు. సుమారు 400కుపైగా సినిమాలకు పనిచేశాడు. ఈ క్రమంలో కుటుంబంలో గొడవలు, కార్మిక నాయకులతో విబేధాల కారణంగా రోడ్డున పడ్డాడు.
నాలుగు చక్రాల బండిలో..
షూటింగ్స్ లేక పూటగడవమే కష్టంగా మారింది. చివరకు అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఓ మూలన పాడైన నాలుగు చక్రాల బండిలో తలదాచుకుంటూ.. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, అక్కడే ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ వంక ఆశగా ఎదురుచూసేవాడు. లాక్‌డౌన్‌తో నరసింహం పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. దాతలిచ్చే ఆహార పొట్లాలతో ఓ పూట తింటూ మరో పూట పస్తులుంటూ రేపటి కోసం ఆశగా ఎదురుచూస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు.
ఇవీ చూడండి: పాము కాటేసిందని వెళ్తే.. కరోనా ఉందని తెలిసింది..