కొత్త కథతో వస్తే ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని చూడరు. ఈ విషయం ఇప్పుడు చెప్పడానికి కారణం.. తాజాగా విడుదలైన 'జోహార్' సినిమా ఫస్ట్‌లుక్. ఐదుగురు వ్యక్తుల జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో నాలుగు కథలు ఉన్నాయి. కానీ తీసుకోవాల్సిన నిర్ణయం మాత్రం ఒక్కటే. అదెంటో తెలియాలంటే చిత్రమొచ్చే వరకు ఆగాల్సిందే.
ఇటీవలే లండన్‌లో ఈ సినిమాకు సంబంధించిన సౌండ్ మిక్సింగ్ జరిగింది. ఆ ఫొటోలను ట్విట్టర్లో పంచుకుంది చిత్రబృందం. ఇందులో ఎస్తర్ అనిల్, రోహిణి, శుభలేఖ సుధాకర్, ఈశ్వరీ రావ్, నైనా గంగూలీ, అంకిత్, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. తేజ మర్ని దర్శకత్వం వహించాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: శ్రియను భయపెట్టిన పోలీసులు.. షాక్‌లో ముద్దుగుమ్మ