ప్రముఖ నటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని ఆయన భార్య జీవిత చెప్పారు. ఆక్సిజన్ అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపారు. వెంటిలేటర్‌పై వైద్యం అందిస్తున్నారంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.
ఇటీవల.. కరోనా బారిన పడిన రాజశేఖర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
"రాజశేఖర్ గారి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోంది. ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. సిటీ న్యూరో సెంటర్ వైద్యుల బృందం నిరంతరంతర పర్యవేక్షణ వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. త్వరలోనే ఐసీయూ నుంచి బయటకు వస్తారు. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారన్న వార్తలు అవాస్తవం. ఆయనకు ఏ రోజూ వెంటిలేటర్ మీద లేరు. కానీ ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారిన మాట నిజమే"
-- నటి జీవిత, హీరో రాజశేఖర్ భార్య
అనంతరం రాజశేఖర్ కోలుకోవాలని ప్రార్థనలు చేసిన అభిమానులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు జీవిత కృతజ్ఞతలు తెలిపారు.