బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది. అభిమానులకు పండగే పండగ. ఇప్పుడు దీనినే నిజం చేసేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ డైరెక్షన్ చేసేందుకు సిద్ధమయ్యారు. 'జీ లే జరా' టైటిల్‌తో కొత్త సినిమా ప్రకటించారు. రోడ్ ట్రిప్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రాన్ని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. 2023లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా 'దిల్ చహ్తా హై' 20ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త సినిమా ప్రకటన చేయడం సంతోషంగా ఉందని అన్నారు ఫర్హాన్ అక్తర్. చివరిసారిగా 2011లో షారుక్ ఖాన్‌తో 'డాన్ 2'ను తెరకెక్కించిన ఆయన.. ఇటీవల 'తుఫాన్' సినిమాతో నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఫర్హాన్ సినిమాలో నటించడంపై ప్రియాంక, ఆలియా, కత్రినా కూడా హర్షం వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరోయిన్లు ఒకే తెరపై కనిపిస్తారని తెలియగానే ఫ్యాన్స్ కూడా సోషల్‌మీడియా వేదికగా ఆనందాన్ని తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం ఆలియా భట్(ఆర్ఆర్ఆర్, బ్రహ్మస్త్ర, గంగూబాయ్ కతియావాడి), ప్రియాంక చోప్రా(మ్యాట్రిక్స్, టెక్స్ట్ ఫర్ యూ), కత్రినా కైఫ్(ఫోన్ భూత్, టైగర్ 3) పలు చిత్రాల్లో నటిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: ట్రైలర్స్‌తో అలరిస్తోన్న 'పాగల్', 'బొమ్మల కొలువు'