Janvikapoor Pushpa movie: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'పుష్ప' సినిమా.. థియేటర్, ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ మూవీని వీక్షించిన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్, హీరో అర్జున్ కపూర్ కూడా చిత్రం అద్భుతంగా ఉందని కొనియాడారు. బన్నీ నటన అదిరిపోయిందని కితాబిచ్చారు.
"అల్లు అర్జున్ ప్రపంచంలోనే కూలెస్ట్ మ్యాన్" అని జాన్వీ తన అభిమానాన్ని చాటుకుంది. "పుష్ప' ఓ సినిమా మాత్రమే కాదు. ఓ అనుభవం. యాటిట్యూడ్, కూల్‌నెస్ రెండు కలగలపిన ఓ మృదువైన కవితాత్మక మోషన్ పిక్చర్. ఆర్య నుంచి పుష్ప వరకు బన్నీ ఎదిగిన తీరు అద్భుతం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ" అని రాసుకొచ్చాడు అర్జున్ కపూర్. కాగా, దీనిపై స్పందించిన అల్లు అర్జున్.. "మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు" అని బదులిచ్చాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: టాలీవుడ్‌ను పలకరించనున్న కొత్త అందాలు ఇవే!