జేమ్స్ బాండ్ సిరీస్.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలకున్న క్రేజే వేరు. ఇప్పటికే 24 చిత్రాలు ఈ సిరీస్‌లో వచ్చాయి. త్వరలో 25వ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేసింది చిత్రబృందం. 'నో టైమ్ టు డై' పేరుతో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
డేనియల్ క్రేగ్ జేమ్స్బాండ్పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే 4 చిత్రాల్లో బాండ్‌గా కనిపించిన ఈ ఇంగ్లీష్ హీరో ఈ సినిమానే తన చివరి చిత్రమని చెప్పాడు. ఇటీవలే జమైకాలో షూటింగ్ జరుపుకుందీ చిత్రం .
ఆస్కార్ అవార్డు విజేత రమీ మాలెక్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. కేరీ జోజి ఫుకూనాగా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని మైఖేల్ జి. విల్సన్, బార్బరా బ్రకోలీ నిర్మిస్తున్నారు. రాల్ఫ్ ఫియెనెస్, నొవామి హ్యారిస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇది చదవండి: పాంటింగ్ రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ