ETV Bharat / sitara

మరో వెబ్​సిరీస్​లో జగపతిబాబు! - Jagapathibabu latest news

నటుడు జగపతి బాబు మరోసారి వెబ్​సిరీస్​లో నటించడానికి సిద్ధమయ్యారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది.

Jagapathibabu to star in another web series!
మరో వెబ్​సిరీస్​లో నటించనున్న జగపతిబాబు!
author img

By

Published : Aug 12, 2020, 5:29 AM IST

Updated : Aug 12, 2020, 6:06 AM IST

టాలీవుడ్​ విలక్షణ నటుడు జగపతి బాబు మరో వెబ్​సిరీస్​లో నటించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టును త్వరలోనే పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. 'బాహుబలి' వంటి భారీ బడ్జెట్​ చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా దీన్ని రూపొందించనుందని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఇది జగపతి బాబు నటించే రెండో వెబ్​సిరీస్​ అవుతుంది. ఇప్పటికే 'గ్యాంగ్​స్టర్స్​' అనే సిరీస్​లో తన నటనతో మెప్పించారు జగపతి.

లాక్​డౌన్​ కారణంగా సినిమా హాళ్లు మూతపడటం వల్ల ఓటీటీల హావా మొదలైంది. దీంతో వెబ్​సిరీస్​ల క్రేజ్​ అమాంతం పెరిగిపోయింది. ఖర్చు కూడా తక్కువ అవ్వడం వల్ల నిర్మాణ సంస్థలన్నీ వెబ్​సిరీస్​ల బాట పట్టాయి. దీనికి తగ్గట్టుగా నటీనటులు కూడా వారి ప్రణాళికలను మార్చుకుంటున్నారు.

Last Updated : Aug 12, 2020, 6:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.