హాలీవుడ్ చిత్రం లయన్ కింగ్ తెలుగు అనువాదానికి తన గొంతు అరువు ఇస్తున్నాడు టాలీవుడ్ నటుడు జగపతి బాబు. లయన్ కింగ్‌లో ప్రతినాయకుడైన స్కార్ పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నాడు. ఇందులో ముఖ్యపాత్రైన ముఫాసా పాత్రకు ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ తన గొంతు ఇవ్వనున్నాడు.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జులై 19న విడుదల కానుంది. ఇంగ్లిషు, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. హిందీలో ముఫాసా పాత్రకు షారుఖ్ డబ్బింగ్ చెప్పనుండగా.. సింబా పాత్రకు కింగ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చెప్పనున్నాడు.
1994లో విడుదలైన లయన్ కింగ్ యానిమేటడ్ చిత్రం ప్రస్తుతం అదే పేరుతో రీమేక్‌గా రూపొందింది. జాన్ ఫేవరో దర్శకత్వ వహిస్తున్న ఈ సినిమాను డిస్నీ సంస్థ నిర్మించింది.
ఇది చదవండి: 'స్పైడర్‌మ్యాన్' విడుదల తేదీ ఖరారు