ETV Bharat / sitara

'అన్నాత్తే' షూటింగ్​ రీస్టార్ట్​.. కీలకపాత్రలో జగపతిబాబు - జగపతిబాబు వార్తలు

సూపర్​స్టార్​ రజనీకాంత్​ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం 'అన్నాత్తే'. ఇందులో ఓ కీలకపాత్ర కోసం నటుడు జగపతిబాబును ఎంపిక చేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. బుధవారం నుంచి జరుగుతోన్న చిత్రీకరణలో.. రజనీ, జగపతిబాబు మధ్య కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

Jagapathi Babu to play rajinikanth annaatthe movie
'అన్నాత్తే' షూటింగ్​ రీస్టార్ట్​.. కీలకపాత్రలో జగపతిబాబు
author img

By

Published : Mar 17, 2021, 11:02 AM IST

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'అన్నాత్తే'. శివ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగు నటుడు జగపతిబాబు ఓ కీలకపాత్ర కోసం ఎంపికయ్యారు. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్‌లో పేర్కొంది. బుధవారం నుంచి జరుగుతోన్న షూటింగ్​లో రజనీకాంత్​, జగపతిబాబు మధ్య కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

జగపతిబాబు తమిళ సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. గతంలో ఆయన రజనీకాంత్‌తో కలిసి 'కథానాయకుడు', 'లింగ' చిత్రాల్లో నటించారు.

Jagapathi Babu to play rajinikanth annaatthe movie
'అన్నాత్తే' షూటింగ్​లో రజనీకాంత్​

గతేడాది డిసెంబర్‌లో షూటింగ్‌ను తిరిగి మొదలు పెట్టినా.. కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ప్రస్తుతం చెన్నైలో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేశ్​, మీనా, ఖుష్బూ, ప్రకాశ్​ రాజ్, రోబో శంకర్‌ తదితరులు నటిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ సంగీత స్వరాలు అందిస్తోన్న ఈ సినిమా నవంబర్‌ 4, 2021 దీపావళికి ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.

ఇదీ చూడండి: "రాజా ది గ్రేట్​' సినిమా రామ్​తో తీయాల్సింది!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.